క్రిస్మస్ సందర్భంగా ఒక మహిళ ఇళ్లంతా విద్యుద్దీపాలతో అందంగా అలంకరించుకుంది. తీరా ఆమెకు వచ్చిన కరెంట్ బిల్లును చూసి షాకయ్యింది. ఇంతకీ ఆమెకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలుసా? 284 బిలియన్ డాలర్లు.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే..అమెరికాలోని పెన్సిల్వేనియాకి చెందిన హోరోమాన్స్కి(58) కి వచ్చిన కరెంట్ బిల్లు చూసి విస్తుపోయింది. ఆన్లైన్ లో కరెంట్ బిల్లును చెక్ చేసుకున్నాక ఆమెకు ఈ విషయం తెలిసింది. 284 బిలియన్ డాలర్లు కరెంట్ బిల్లు చూసి నేను జీవితాంతం కరెంట్ వాడినా బహుశా.. ఆ నెంబర్ కు చేరుకోలేనేమో?! అంటూ పేర్కొనింది. 'క్రిస్మస్ రోజు విద్యుద్దీపాలతో ఇంటిని అలంకరించుకున్నాం. అంతమాత్రాన ఇంత బిల్లు వస్తుందా?' అంటూ ఆమె అధికారులను నిలదీశారు. అధికారుల తప్పిదం వల్లే ఇందంతా జరిగిందని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.


హోరోమాన్స్కికి వచ్చిన అసలు కరెంట్ బిల్లు 284.46 డాలర్లు. అధికారుల పొరపాటు కారణంగా 284 బిలియన్ డాలర్లుగా నమోదై బిల్లులో వచ్చింది. జరిగిన తప్పిదానికి నిర్వాహకులు ఆమెకు క్షమాపణ చెప్పారు.