వాషింగ్టన్: అమెరికన్ ఢిపెన్స్ హెడ్ క్వార్టర్ ప్రస్తుతం ఒక రహస్య కార్యచరణలో బిజీగా ఉంది. అమెరికన్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ ( US Military  Aircraft ) కంటపడిన ఒక యూఎఫ్ఓ రహస్యం ఛేదించే పనిలో పడింది. ఈ టాస్క్ ఫోర్స్ ను అమెరికా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



యూఎఫ్ఓలు అమెరికా సైనిక స్థావరాల ( US Army Camps ) చుట్టే తిరుగుతున్నాయి అని అధికారులు దిగులు పడుతున్నారు. వీటి వల్ల మిలటరీ విమానాలకు ముప్పు పొంచి ఉందేమోనని భయపడుతున్నాడు. అయితే దీని గురించి నిపుణులు మాత్రం మరోలా అంటున్నారు. శత్రు దేశాలకు చెందిన డ్రోన్లు అయి ఉండవచ్చని అంటున్నారు. రహస్యంగా సమాచారం సేకరించడానికి ఇలా చేసి ఉండవచ్చని అంటున్నారు. ఇతర గ్రహాల నుంచి భూమిపైకి యూఎఫ్ఓలు వచ్చే అవకాశం లేదు అని వాళ్లుంటున్నారు.




పెంటగాన్ ఇప్పటికే దీనికి సంబంధించి మూడు వీడియోలను కూడా విడుదల చేసింది. ఇందులో ఒక  అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ మూడు యూఎఫ్ఓ ( UFO- ఎగిరేపల్లాలు ) ఎదుర్కోంటోంది. అయితే ఈ ఫుటేజీని ఏప్రిల్ లో అమెరికా అధ్యక్షుడు కొట్టిపారేశాడు. అది నిజం అని తనకు అనిపించడం లేదు అని అన్నాడు ట్రంప్.




అయితే మేలో ఒక న్యూస్ ఛానెల్ దీని గురించి అమెరికన్ నేవీ నుంచి సేకరించిన సమాచారాన్ని అధారంగా చూపింది.  దాని ప్రకారం అమెరికా కు చెందిన నౌకాదళ (US Navy Aircraft ) ఎయర్ క్రాఫ్ట్ గుర్తు తెలియనని ఎగిరే పల్లాన్ని ఎదర్కొన్నాయి అని .. దీనిగురించి పెంటగానఖ్ కు కూడా తెలుసు అని రిపోర్ట్ చేసింది.