అమెరికాకి చెందిన ప్రఖ్యాత సింగర్ ఫారెల్ విలియమ్స్, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాపీరైట్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. విలియమ్స్ తన ఫిర్యాదులో ఈ సందర్భంగా పలు విషయాలు పేర్కొన్నారు. తను పాడిన "హ్యాపీ"  అనే గీతాన్ని పబ్లిక్ స్థలాల్లో పాడేందుకు లేదా వాడేందుకు ఎవరికి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. తన అనుమతి లేకుండా ఆ పాటను వాడితే కాపీరైట్ ఉల్లంఘన క్రింద శిక్షార్హులవుతారని.. అందుకు ట్రంప్ కూడా మినహాయింపు కాదని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిట్స్‌బర్గ్ ప్రాంతంలో 11 మందిని కాల్చి చంపిన ఘటన జరిగిన రోజునే.. ట్రంప్ వేరే ప్రాంతంలో హ్యాపీ సాంగ్ ప్లే చేశారని.. తనకు అసలు హ్యాపీనెస్ కలిగించని సంఘటన అది అని విలియమ్స్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకే తన అనుమతి లేకుండా ట్రంప్ తన పాటను వాడినందుకు కాపీరైట్ ఉల్లంఘన చట్టం క్రింద ఆయన పై కేసును నమోదు చేస్తున్నానని ఆయన తెలిపారు. ట్రంప్ ఇండియానా ర్యాలీకి వచ్చినప్పుడు రిపబ్లికన్ అయిన మైక్ బోస్ట్‌కి మద్దతు ఇస్తూ ఈ సాంగ్‌ను ప్లే చేశారు. 


అయితే రికార్డింగ్ ఆర్టిస్టులు ట్రంప్ పై ఇలాంటి కేసులు పెట్టడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ప్రిన్స్ అనే ఆర్టిస్టు ట్రంప్ ర్యాలీల్లో తన గీతం "పర్పుల్ రైన్"ను ప్రదర్శించినందుకు మండిపడ్డారు. ట్రంప్ ఆఫీసుకి సీజ్ అండ్ డెసిస్ట్ లెటర్  పంపించారు. అలాగే స్టీవెన్ టైలర్ కూడా గతంలో తమ గీతమైన "లివన్ ఆన్ ది ఎడ్జ్"ను ట్రంప్ ర్యాలీల్లో వాడినందుకు అభ్యంతరం తెలిపారు.