PM Modi, PM Rishi Sunak: రిషి సునాక్‌కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్
PM Modi Congratulates PM Rishi Sunak: బ్రిటన్‌కి కొత్త ప్రధానిగా ఎన్నికైన భారత సంతతి నేత రిషి సునాక్‌కి భారత్ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, ద్వైపాక్షిక అంశాల గురించి ఇద్దరు ప్రధానులు చర్చించుకున్నారు.
PM Modi Congratulates PM Rishi Sunak: ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. యునైటెడ్ కింగ్ డమ్ కి ప్రధానిగా ఎన్నికయిన రిషి సునాక్ కి 1.6 బిలియన్ల మంది భారతీయుల తరపున ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. రిషి సునాక్ కి అభినందనలు తెలియజేసే క్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బ్రిటన్, భారత దేశాల మధ్య చారిత్రక సంబంధాలకు రిషి సునాక్ ఒక ఉదాహరణగా నిలిచారని కొనియాడారు. మన రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడాలని కాంక్షిస్తున్నట్టు మోదీ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఇరు దేశాలు కలిసి ఎదుర్కోవాల్సి ఉన్న సమస్యలు, అంశాలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య క్షుణ్ణంగా చర్చకొచ్చాయి. క్లైమేట్ చేంజ్ విషయంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేస్తోన్న కృషిని రిషి సునాక్ అభినందించారు. దేశ భద్రత, రక్షణ రంగం, ఆర్థికాభివృద్ధి పరమైన అంశాల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని రిషి సునాక్ స్వాగతించారు.
రానున్న రోజుల్లోనూ బ్రిటన్, భారత్ దేశాల మధ్య పరస్పర సహకారం ఇలాగే కొనసాగిస్తూ కలిసి పురోగతి సాధించాలని, వాణిజ్య రంగంలోనూ మరింత వృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్టు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు. ఇరు దేశాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రజాస్వామ్యం కలిగిన రెండు పెద్ద దేశాలుగా పేరున్న భారత్, బ్రిటన్ ( Britain ) కలిసి పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాల ప్రధానులు ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఇండోనేషియాలో జరగనున్న జి20 సదస్సులో వ్యక్తిగతంగా కలుసుకోనున్నట్టు ఇరు దేశాల ప్రధానులు తెలిపారు.
Also Read : Rishi Sunak relatives: రిషి సునాక్ బంధువుల కుటుంబాల్లో అంబరాన్నంటిన సంబరాలు
Also Read : Rishi Sunak to Kamala Harris: రిషి సునక్ ఒక్కడే కాదు.. విదేశాలను ఏలిన భారతీయుల జాబితా
Also Read : Rishi Sunak Interesting Facts: రిషి సునక్ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి