వేగంగా బైక్ నడుపుతున్న వ్యక్తిని అరెస్టు చేయాలా?వద్దా అని సరదాగా పోలీసులు వేసిన టాస్ కొంపముంచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసుల కథనం ప్రకారం, అట్లాంటాలోని ఓ హెయిర్ సలూన్‌లో పనిచేస్తున్న వ్యక్తి డ్యూటీకి లేట్ అవుతుందని బైక్‌ను గంటకు 130 కి.మీల వేగంతో నడిపాడు. ఆ సమయంలో అతడిని ఇద్దరు జార్జియా మహిళా పోలీసులు అడ్డుకున్నారు. ఆ ఇద్దరు మహిళా పోలీసులు సారా వెబ్(వాహనదారుడు)కు వేగంగా బైక్ నడిపినందుకు చలానా రాసివ్వాలనా?లేక నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు అతడిని అరెస్టు చేయాలా? అని మాట్లాడుకున్నారు. చివరకు కాయిన్‌తో టాస్ వేద్దామనుకొని ఓ నిర్ణయానికి వచ్చారు. బొమ్మ పడితే అరెస్టు చేద్దామని, బొరుసు పడితే వదిలేద్దామని టాస్ వేశారని రాస్‌వెల్ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.


ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను స్థానిక టెలివిజన్ ఛానళ్ళు  సంపాదించి కథనాలను ప్రసారం చేశాయి. ఈ ఘటనపై అంతర్గతంగా విచారణకు ఆదేశించామని అట్లాంటా పోలీసు అధికారులు తెలిపారు. నేరం రుజువైతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం వారిద్దరూ అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌లో ఉన్నట్లు చెప్పారు. కాగా.. ఆ ఇద్దరు మహిళా పోలీసులు సస్పెండ్ అయినట్లు స్థానిక వార్తాలు వెలువడ్డాయి.