Political trouble in Nepal: న్యూఢిల్లీ‌: నేపాల్‌లో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. తాజాగా నెలకొన్న రాజకీయ సంక్షోభంతో ప్రధాని కేపీ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా సొం‍త పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఆదివారం నేపాల్‌ పార్లమెంట్‌ రద్దును ప్రతిపాదించారు. నేపాల్ ప్రధాని తీసుకున్న పార్లమెంట్‌ రద్దు (dissolving Nepal Parliament) నిర్ణయానికి ఆదివారం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వెంటనే రద్దుకు సంబంధించిన ప్రతులను కేబినెట్‌ నేపాల్‌ రాష్ట్రపతికి పంపించినట్లు ఆ దేశ ఇంధన శాఖ మంత్రి బర్సామన్ పున్ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి (KP Sharma Oli) ఆదివారం ఉద‌యం కేబినెట్ స‌మావేశానికి పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన సమావేశంలో (Nepal) పార్ల‌మెంట్ ర‌ద్దు చేయాలంటూ ప్రెసిడెంట్‌కు సిఫార‌సు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రధాని నిర్ణయాన్ని అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (Nepal Communist Party) నేతలు తప్పబడుతున్నారు. Also read:Mount Everest height: ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరిగింది


ఓ వివాదాస్ప‌ద ఆర్డినెన్స్ ర‌ద్దు చేయాలంటూ నేపాల్ క‌మ్యూనిస్ట్ పార్టీలోని ప్ర‌ధాని విరోధులు కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలి తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నిర్ణయం తరువాత నేపాల్ ప్రధాని ఓలి రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం.  Also read: Narendra Modi: గురుతేజ్ బహదూర్‌కు ప్రధాని మోదీ నివాళి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook