PM Narendra Modi visits Gurudwara Rakabjung: న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని గురుద్వారా రాకబ్‌జంగ్ సాహిబ్ ( Gurudwara Shri Rakab Ganj Sahib) ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం ఉదయం గురుద్వారా రాకాబ్‌గంజ్‌కు చేరుకోని గురుతేజ్ బహదూర్‌కు నివాళులు అర్పించారు. అంతేకాకుండా అర్థాస్ కార్యక్రమంలో కూడా ప్రధాని మోదీ పాల్గొని గురుతేజ్ బహదూర్ (Guru Teg Bahadur) ఆశీస్సులు పొందారు.
#WATCH | PM Narendra Modi offers prayers at Gurudwara Rakab Ganj Sahib in Delhi. (Source - DD) pic.twitter.com/Ap9MchtdYP
— ANI (@ANI) December 20, 2020
అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గురుద్వారా సందర్శన కార్యక్రమాన్ని ఉన్నట్టుండి నిర్ణయించుకున్నారు. ప్రధాని గురుద్వారా చేరుకునే సమయంలో ఆయనకు ప్రత్యేక పోలీసు బందోబస్తు లేదు. అలాగే ఈ మార్గంలో ఎటువంటి ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేయలేదు. ఈ రోజు ఉదయాన్నే చలిలో ఒక సామాన్య వ్యక్తిలా ప్రధాని మోదీ గురుద్వారా చేరుకొని గురు తేజ్ బహదూర్‌కి నివాళులర్పించారు. Also read: Farmer protests: 25వ రోజుకు ఆందోళనలు.. నేడు అమర రైతులకు నివాళి
This morning, I prayed at the historic Gurudwara Rakab Ganj Sahib, where the pious body of Sri Guru Teg Bahadur Ji was cremated. I felt extremely blessed. I, like millions around the world, am deeply inspired by the kindnesses of Sri Guru Teg Bahadur Ji. pic.twitter.com/ECveWV9JjR
— Narendra Modi (@narendramodi) December 20, 2020
ఢిల్లీ (Delhi) లోని గురుద్వారా సందర్శన తరువాత ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఫొటోలను షేర్ చేసి ఈ విధంగా రాశారు. ఈ రోజు చారిత్రాత్మక గురుద్వారా రకాబగంజ్ సాహిబ్‌కు వెళ్లి ప్రార్థనలు చేశానని. అక్కడ గురుతేజ్ బహదుర్ పవిత్ర శరీరానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారని తెలిపారు. ఈ రోజు ఆయన ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు. ప్రపంచంలోని లక్షలాది మంది మాదిరిగానే.. తాను కూడా గురుతేజ్ బహదూర్ ప్రేరణ పొందానని మోదీ ట్విట్ చేశారు. Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook