ఇండోనేషియాలోని లోమ్‌బోక్ దీవుల్లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. భూకంపం దాటికి కనీసం పది మంది వ్యక్తులు మృతిచెందినట్లు.. 40 మంది గాయపడ్డట్లు  అధికారులు వెల్లడించారు. భూకంపం ధాటికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. నివాసాల నుంచి భయంతో బయటకి పరుగులు తీశారు.


భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 7 కిలోమీటర్ల లోపల ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 40 సార్లు భూ ప్రకంపనలు నమోదైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇంకా శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు చెబుతున్నారు. వారందరినీ బయటికి తీసేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తోంది.