డొనేటర్గా మారిన డొనాల్డ్ ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నాలుగో త్రైమాసిక జీతాన్ని మొత్తం ఆ దేశ రవాణా శాఖకు డొనేట్ చేసేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నాలుగో త్రైమాసిక జీతాన్ని మొత్తం ఆ దేశ రవాణా శాఖకు డొనేట్ చేసేశారు. అమెరికాలో రవాణా వ్యవస్థ పునరుద్ధరణకు, మౌళిక వసతుల అభివృద్ధికి ఆ ధనాన్ని ఉపయోగించాలని ఆయన కోరారు. ఇటీవలే శ్వేతభవనంలో జరిగిన మీడియా మీటింగ్‌లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. అమెరికాలో ఇంకా పలు చోట్ల బ్రిడ్జిలు, పోర్టులు కట్టాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అందుకోసం తన జీతాన్ని సైతం వినియోగించాలని ట్రంప్ తెలిపారు. తన వేతనాన్ని దేశ అవసరాల కోసం ఉపయోగించడం ట్రంప్‌కు ఇది కొత్త కాదు.
తను అమెరికన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైనా కూడా జీతం లేకుండా పనిచేస్తానని ఆయన గతంలో తెలిపారు. అయితే రూల్స్ ఎవరికైనా ఒకటే కాబట్టి.. అమెరికా ప్రెసిడెంట్ కూడా తప్పనిసరిగా జీతం తీసుకోవాల్సిందే అని ఆ దేశ చట్టం చెప్పడంతో.. ఆయన జీతాన్ని తీసుకుంటూ ఇలా డొనేట్ చేయాలని భావించారు. ట్రంప్ గతంలో కూడా పలు శాఖలకు తన జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు, జాతీయ పార్కులు, విద్యాశాఖలు మొదలైన వాటికి ఆయన గతంలో తన జీతాన్ని డొనేట్ చేశారు.