26 feet Python swallowed Woman in Indonesia: ఇండోనేషియా దేశంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. రబ్బరు ఏరేందుకు అడవిలోకి వెళ్లిన 52 ఏళ్ల మహిళను భారీ కొండచిలువ మింగేసింది. రబ్బరు కోసం వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన భర్త.. అడవిలో వెళ్లి చూడగా అసలు నిజం బయటపడింది.  గ్రామస్థులందరూ కలిసి కొండచిలువను చంపి మహిళ మృతదేహాన్ని బయటికి తీశారు. ఇందుకు సంబందించిన వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెటారా జాంబి ప్రావిన్స్‌కు చెందిన 54 ఏళ్ల మహిళా జారా రబ్బర్‌ ఏరేందుకు ఆదివారం అడవిలోకి వెళ్లింది. రబ్బరు కోసం వెళ్లిన భార్య తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త ఆందోళన చెందాడు. భార్య కోసం కుటుంబసభ్యులతో కలిసి అడవిలోకి వెళ్లగా.. ఆమె చెప్పులు, జాకెట్, తలపై కండువా మరియు కత్తి కనిపించాయి. దీంతో వారు గ్రామస్థులు, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అందరూ అడవిలో గాలించగా.. వారికి 22 అడుగుల కొండచిలువ కనిపించింది. దాని కడుపు ఉబ్బి ఉండడంతో జారాను కొండచిలువే మింగేసి ఉంటుందని అధికారులు అనుమానించారు. 



గ్రామస్థులందరూ కలిసి భారీ కొండచిలువను మట్టుపెట్టారు. దాని పొట్టను చీల్చి చూడగా.. పూర్తిగా జీర్ణం కాని స్థితిలో ఉన్న జారా మృతదేహం కనిపించింది. అధికారులు మహిళ మృతదేహాన్ని బయటకు తీసి కుటుంబ సబ్యులకు అప్పగించారు. జారాను మింగేందుకు కొండచిలువకు కనీసం రెండు గంటల సమయం పట్టిఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫొటోస్, వీడియో చూసిన వారు అయ్యో పాపం అంటున్నారు. గతంలో ఈ ప్రాంతంలో 27 అడుగుల కొండచిలువ కూడా కనిపించిందట. 


Also Read: IND vs NED Dream11 Prediction:  నెదర్లాండ్స్‌తో భారత్ మ్యాచ్‌.. డ్రీమ్ ఎలెవన్ టీమ్ ఇదే!  


Also Read: Rakul Preet Singh Pics: గ్లామర్ ట్రీట్‌తో షాక్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. అన్నీ కవర్ చేస్తోందిగా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి