IND vs NED Dream11 Prediction: నెదర్లాండ్స్‌తో భారత్ మ్యాచ్‌.. డ్రీమ్ ఎలెవన్ టీమ్ ఇదే!

India vs Netherlands T20 World Cup 2022 Dream11 Prediction. టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్ 12లో భాగంగా గురువారం పసికూన నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ కొట్టనుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 26, 2022, 02:44 PM IST
  • నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ
  • డ్రీమ్ ఎలెవన్ టీమ్ ఇదే
  • భారత్ తుది జట్టు ఇదే
IND vs NED Dream11 Prediction:  నెదర్లాండ్స్‌తో భారత్ మ్యాచ్‌.. డ్రీమ్ ఎలెవన్ టీమ్ ఇదే!

India vs Netherlands T20 World Cup 2022 Match 23 Top Fantasy Picks: టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్ 12లో భాగంగా గత ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ చిరస్మరణీయ విజయం అందుకుంది. మెగా టోర్నీలో భాగంగా గురువారం పసికూన నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ కొట్టనుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. పాకిస్తాన్‌పై గెలిచిన భారత్ జోరుమీదుండగా.. బంగ్లాపై ఓడిన నెదర్లాండ్స్‌ పుంజుకోవాలని చూస్తోంది. అయితే పటిష్ట టీమిండియాను ఓడించడం నెదర్లాండ్స్‌కు అంత సులువు కాదు. 

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ నిరాశపరిచారు. దాంతో మిగతా బ్యాటర్లపై భారం పడింది. నెదర్లాండ్స్‌పై అయినా ఓపెనర్లు ఫామ్ అందుకోవాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. విరాట్ కోహ్లీ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ సత్తాచాటాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో అదరగొట్టాడు.  దురదృష్టవశాత్తూ అక్షర్ పటేల్ రనౌట్ కావడంతో.. లెఫ్ట్ హ్యాండర్ రిషబ్ పంత్‌ను తుది జట్టులో తీసుకోవాలని కొందరు మాజీలు సూచిస్తున్నారు. ఒక ఓవర్‌ మాత్రమే వేసిన అక్షర్‌ ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో అతడి చోటు దక్కడం కష్టమే. 

దినేష్ కార్తీక్ కీపింగ్ బాగానే చేసినా.. కీలక సమయంలో ఔట్ అయి ఉత్కంఠతకు తెరలేపాడు. కార్తీక్, రిషబ్ పంత్‌జట్టులో ఉండాలంటే.. హార్దిక్ పాండ్యా పూర్తి కోటా ఓవర్లు వేయాల్సి ఉంటుంది. బంతితో ఆకట్టుకోలేకపోయిన వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ను కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పేస్ కోటాలో అర్షదీప్‌ సింగ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ కొనసాగనున్నారు. 

భారత్ తుది జట్టు:
కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ (కెప్లెన్), విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, రిషబ్ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, రవిచంద్రన్ అశ్విన్/యుజ్వేంద్ర చహల్ అర్షదీప్‌ సింగ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ. 

డ్రీమ్ ఎలెవన్ టీమ్:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ (వైస్ కెప్టెన్), స్కాట్ ఎడ్వర్డ్స్, మ్యాక్స్ ఓడౌడ్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బాస్ డి లీడే, హార్దిక్ పాండ్యా, వాన్ మీకెరన్, క్లాసెన్, అర్షదీప్‌ సింగ్‌. 

Also Read: Rakul Preet Singh Pics: గ్లామర్ ట్రీట్‌తో షాక్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. అన్నీ కవర్ చేస్తోందిగా!

Also Read: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు స్టార్‌ ప్లేయర్‌ దూరం.. టీమిండియా కోచ్‌ ఏం చెప్పాడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News