Rafale Aircraft: ఫ్రాన్స్ నుంచి భారత్‌కు నాన్‌స్టాప్‌గా రానున్న మూడు రాఫేల్స్
భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా మొదటి బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) వచ్చి చేరిన సంగతి తెలిసిందే. అయితే రెండో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు ( Rafale Jets Second Batch ) ఈ నెల 4వ తేదీన (November 4) భారత్‌కు చేరుకోనున్నాయి.
Second batch of Rafale Fighter Jets arrive in India on November 4: న్యూఢిల్లీ: భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా మొదటి బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) వచ్చి చేరిన సంగతి తెలిసిందే. అయితే రెండో బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాలు ( Rafale Jets Second Batch ) ఈ నెల 4వ తేదీన (November 4) భారత్‌కు చేరుకోనున్నాయి. ఈ మూడు రాఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్‌లోని ఇస్‌ట్రెస్ నుంచి నేరుగా భారత్‌లోని జామ్‌నగర్‌కు రానున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. అయితే ఫ్రాన్స్ నుంచి ఈ రాఫేల్ యుద్ధ విమానాలు సుమారు 8 గంటల పాటు నాన్ స్టాప్‌గా ప్రయాణించనున్నాయి. ఈ విమానాలకు ఫ్రాన్స్ వాయుసేనకు చెందిన విమానం ఇంధనం నింపనుంది. ఈ మేరకు భారత వాయుసేన (IAF) గతనెలలో యుద్ధ విమానాల రవాణా, పైలట్లకు శిక్షణ కోసం ఒక బృందాన్ని ఫ్రాన్స్ (France) కు పంపిన సంగతి తెలిసిందే. Also read: India: పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాలను ఖాళీ చేయాలి: భారత్
ఆత్యాధునిక 36 రాఫెల్స్‌ను రూ.59,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు భారత్, ఫ్రాన్స్ మధ్య 2016లో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా తొలి బ్యాచ్‌గా ఐదు రాఫెల్ జెట్స్ భారత్‌కు చేరాయి. రెండో బ్యాచ్‌లో 3 యుద్ధ విమానాలు రానుండగా.. ఇంకా 28 రాఫేల్ జెట్స్‌ను 2021 చివరి నాటికి ఫ్రాన్స్ భారతదేశానికి అందించనుందని అధికారులు వెల్లడించారు. Also read: Rafale Fighter Jets: సర్వమత ప్రార్థనలతో.. భారత వైమానిక దళంలోకి రఫేల్ జెట్స్
అయితే మొదటి విడతలో వచ్చిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు అరబ్ ఎమిరేట్స్‌లోని అల్ దఫ్రా ఎయిర్‌బేస్‌లో బ్రేక్ తీసుకోని జూలై 29న భారత్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ రాఫెల్స్ కోసం అంబాలా ఎయిర్ బేస్‌లో ‘గోల్డెన్ యారోస్’ అనే పేరుతో కొత్త ఎయిర్ స్క్వాడ్రన్‌ను సైతం అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రాఫెల్స్‌ను సెప్టెంబరు 10న అధికారికంగా భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. అయితే రెండవ స్క్వాడ్రన్ విమానాలను బెంగాల్‌లోని హసిమరా ఎయిర్‌బేస్‌లో ఉంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. Also read: Tedros Adhanom Ghebreyesus: క్వారంటైన్‌లోకి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్
ఇదిలాఉంటే.. తూర్పు లఢఖ్ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అత్యధునిక యుద్ధ విమానాలు రాఫెల్స్‌ను కూడా రక్షణ కోసం సరిహద్దులోకి మోహరించారు. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ ఏమాత్రం వక్రబుద్ధి చూపించినా.. తగిన బుద్ధి చెప్పేందుకు, వారి ఆట కట్టించేందుకు భారత ఆర్మీ, భారత వాయుసేన ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాఫెల్స్ రెండో బ్యాచ్ భారత్‌కు చేరనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe