America Elections: మళ్లీ డోనాల్డ్ ట్రంప్ నే అభ్యర్ధి: రిపబ్లికన్ పార్టీ అధికారిక ప్రకటన
అమెరికాలో ( America elections ) ఎన్నికల సందడి ప్రారంభమైపోయింది. అధికార రిపబ్లికన్ పార్టీ తన అభ్యర్ధుల్ని అదికారికంగా ప్రకటించింది. మరోసారి డోనాల్డ్ ట్రంప్, మైక్ పెన్స్ లు అధ్యక్ష , ఉపాధ్యక్ష అభ్యర్ధులుగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

అమెరికాలో ఈ యేడాది చివర్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే డెమోక్రటిక్ పార్టీ ( Democratic party ) తన అభ్యర్ధుల్ని ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీ డెమోక్రటిక్ తరపున అధ్యక్ష పదవికి జో బిడెన్ ( joe bidden ), ఉపాధ్యక్ష పదవికి భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ ( kamala harris ) లు పోటీ చేస్తున్నారు.ఇక అధికార పార్టీగా ఉన్న రిపబ్లికన్ ( Republican party ) తరపున మరోసారి డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ), మైక్ పెన్స్ ( mike pence ) లు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు రిపబ్లికన్ పార్టీ అధికారికంగా ఈ ఇద్దరు పేర్లను ప్రకటించింది. అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మరోసారి పోటీ చేస్తున్నారనేది అందరికీ తెలిసిందే అయినా...పార్టీ తరపున అధికారికంగా వెలువడటం ఇదే .