WHO: కరోనా ఔషధ ప్రయోగాలు త్వరలోనే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
కోవిడ్ 19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోంది. అన్ని దేశాల్లోనూ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతోపాటు చాలా దేశాల్లో వివిధ రకాల మందుల్ని ఈ వైరస్ పై ప్రయోగిస్తూ పరిశోధనలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల ఫలితాలు ఎలా ఉన్నాయనే దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటన ఇప్పుడు అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. మరో రెండు వారాల్లోనే ఔషధాల ప్రయోగ ఫలితాలు రానున్నట్టు డబ్యూహెచ్ వో స్పష్టం చేయడమే దీనికి కారణం.
కోవిడ్ 19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోంది. అన్ని దేశాల్లోనూ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతోపాటు చాలా దేశాల్లో వివిధ రకాల మందుల్ని ఈ వైరస్ పై ప్రయోగిస్తూ పరిశోధనలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల ఫలితాలు ఎలా ఉన్నాయనే దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటన ఇప్పుడు అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. మరో రెండు వారాల్లోనే ఔషధాల ప్రయోగ ఫలితాలు రానున్నట్టు డబ్ల్యూహెచ్ వో ( WHO) స్పష్టం చేయడమే దీనికి కారణం.
మలేరియాకు అందించే హైడ్రోక్సీ క్లోరోక్విన్ (Hydroxychloroquine ), హెచ్ ఐవీ డ్రగ్ గా ప్రాచుర్యం పొందిన లోపినావిర్, రిటోనావిర్, ఇంటెర్ ఫెరాన్ విత్ లోపినావిర్, రిటోనావిర్ మందులతో పాటు రెమిడెసివిర్ (Remdesivir) మందుల్ని కరోనాకు చికిత్సలో అందిస్తూ ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాలన్నీ ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్నాయి. కరోనా వైరస్ సోకిన రోగులకు ఈ మందుల్ని ఇస్తూ...అనంతర పరిణామాలపై కీలకంగా గమనిస్తున్నారు. ముఖ్యంగా తీసుకోవల్సిన జాగ్రత్తలు వంటివాటిని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే హైడ్రోక్సీ క్లోరోక్విన్ ( HCQ ) ను కరోనాకు చికిత్సలో ఆశించిన ఫలితాల్ని ఇవ్వకపోవడంతో ఈ మందును నిలిపివేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నెలలో ప్రకటించింది. అయితే కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యగానైనా ఈ మందును ఉపయోగించవచ్చా అనే కోణంలో మాత్రం ఇంకా పరిశోధన కొనసాగుతోంది. ఇలా వివిధ రకాల మందులు వివిధ రకాల కరోనా రోగులపై ప్రయోగిస్తూ పరిశోధనలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. వీటికి సంబంధించిన ఫలితాలు మరో రెండు వారాల్లోనే రానున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్ (Tedros Adhanom) ప్రకటించడంతో అందరిలో ఆశలు చిగురిస్తున్నాయి. Also read: Karnataka: కర్నాటకలో కరోనా కల్లోలం: 32 మంది పదో తరగతి విద్యార్ధులకు సోకిన కరోనా
మరోవైపు కరోనాకు వ్యాక్సిన్ కొనుగొనే పరిశోధనలు ముమ్మరమవుతున్నాయి. భారత సహా అగ్రదేశాలు ఈ పనిలో పడ్డాయి. కొన్ని సంస్థలైతే ఫలానా తేదీ లోగా అంటూ ప్రకటనలు కూడా చేస్తున్నాయి. దీని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమవుతున్నాయి. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనే విషయంపై అంచనాకు రావడం పూర్తిగా తెలివితక్కువ పనేనంటూ డబ్ల్యూహెచ్ వో ( WHO) అత్యవసర సేవల విభాగం అధిపతి మైక్ ర్యాన్ స్పష్టం చేశారు. ఎందుకంటే వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు త్వరలో వెల్లడైనా సరే...పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసి మార్కెట్ లో అందుబాటులో తీసుకురావడమనేది అప్పటికప్పుడు సాధ్యమయ్యే పని కాదు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.