Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై కాలిబర్ క్షిపణి ప్రయోగించిన రష్యా..
ఇప్పటికే ఉక్రెయిన్ పై రెండుసార్లు కింజల్ హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించిన పుతిన్ సేనలు తాజాగా మరో శక్తిమంతమైన క్రూజ్ మిస్సైల్ కాలిబర్‌ను మరోసారి ప్రయోగించింది.
Russia Attacks on Ukriane Orjeva With Kruz Missile Caliber: ఉక్రెయిన్ నుంచి ప్రతిఘటన పెరుగుతున్న కొద్దీ యుద్ధాన్ని రష్యా మరింత తీవ్ర తరం చేస్తోంది. తన అమ్ములపొది నుంచి కీలక అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ పై రెండుసార్లు కింజల్ హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించిన పుతిన్ సేనలు తాజాగా మరో శక్తిమంతమైన అస్త్రానికి బయటకు తీశాయి.
దీర్ఘ శ్రేణి క్రూజ్ మిస్సైల్ కాలిబర్‌ను రష్యా మరోసారి ప్రయోగించింది. క్రిమియాలోని సెవస్ట్‌పోల్ వద్ద సముద్రంపై రష్యన్ కార్వెట్టి నుంచి ఈ మిస్సైల్‌ను ప్రయోగించారు. ఉక్రెయిన్‌లోని ఒర్జెవాలోని సైనిక స్థావరమే లక్ష్యంగా దీన్ని రష్యా ప్రయోగించింది. ఈ ప్రాంతం రాజధాని కీవ్‌కు 200 మైళ్ల దూరంలో ఉంది. కాలిబర్ దాడిలో ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల నుంచి అందిన ఆయుధాల సైతం ధ్వంసమైనట్లు రష్యా సైన్యం ప్రకటించింది.
శత్రుదేశాల గగనతల వ్యవస్థలను ఛేధించుకుంటూ.. వెళ్లి భూమిపై ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయడంలో కాలిబర్ క్షిపణికి పెట్టింది పేరు. ఈ క్షిపణులను అత్యంత కీలకమైన లక్ష్యాలపై మాత్రమే రష్యా ప్రయోగిస్తుందంటున్నారు. భూమికి తక్కువ ఎత్తులో ఈ మిస్సైల్ ప్రయాణిస్తుంది. దాదాపు 500 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలిగే కాలిబర్ క్షిపణి లక్ష్యాన్ని మార్గమధ్యంలోనే అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. గోదాములు, కమాండ్ పోస్టులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు ఈ క్షిపణిని వాడతారు.
కాలిబర్ దీర్ఘశ్రేణ క్రూజ్ మిసైల్‌ను రష్యా ఉపయోగించడం ఇది రెండో సారి. మార్చి నెల మొదట్లో కూడా మైకలైవ్ నగరంపై ఈ క్షిపణిని ప్రయోగించింది. ఆనాటి దాడిలో 8 మంది మృతిచెందారు. కాలిబర్‌ను అభివృద్ధి చేశాకా రష్యా 2015 అక్టోబర్‌లో తొలిసారిగా సిరియాపై ఈ క్షిపణిని రష్యా ప్రయోగించింది. కాస్పియన్ సముద్రం నుంచి 26 కాలిబర్ క్షిపణులు సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రెబల్స్‌పై ప్రయోగించారు.
Also Read: RRR Collection in USA: ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్.. USA ప్రీమియర్స్ లో 3 మిలియన్ డాలర్లు!
Also Read: Ram Charan Boxing: RRR మూవీ ఆ ఒక్క సీన్ కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో చూడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook