Russia Claims Lsrael Supports: రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధంతో పాటు మాటల మంటలు కొనసాగుతున్నాయి.  యుద్ధంలో ఇరుదేశాల సైన్యాలు పోటాపోటిగా యుద్ధం చేస్తున్నాయి. గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఇరు దేశాల యుద్ధంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీని జర్మని నియంత హిట్లర్‌తో పోల్చుతూ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ చేసిన కామెంట్స్‌ వివాదాస్పదమవుతున్నాయి. హిట్లర్‌లోనూ యూదుల రక్తం ఉండొచ్చని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ కామెంట్స్‌ తీవ్ర కలకలం రేపుతుంది. ఇటలీకి చెందిన ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో లావ్రోవ్‌ మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉక్రెయిన్‌ను డీ-నాజీఫై చేస్తామంటున్న రష్యా తన పోరాటాన్ని ఎలా సమర్థించుకుంటుందన్న దానిపై లావ్రోవ్ స్పందిస్తూ.. ‘ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీ స్వయంగా ఓ యూదు అయినప్పటికీ..ఉక్రెయిన్‌లో నాజీజం ఉనికి ఉండొచ్చు అని తెలిపారు. తాను తప్పు కావచ్చు.. కానీ, హిట్లర్‌లోనూ యూదు బ్లడ్‌ ఉంది. అదేం విషయం కాదన్నారు. దీంతో లావ్రోవ్‌ కామెంట్స్‌పై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.



ఇజ్రాయిల్‌ ప్రధాని నఫ్తాలీ బెనెట్ స్పందిస్తూ.. ఇలాంటి అబద్ధాలు హిస్టరిలో భయంకరమైన నేరాలకు యూదులనే నిందించడానికి ఉద్దేశించినవి అని అన్నారు. లావ్రోవ్ కామెంట్స్‌ క్షమించరానివని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యైర్ లాపిడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోలోకాస్ట్‌లో యూదులు తమను తాము చంపుకోలేదని తెలిపారు. రష్యా రాయబారిని పిలిపించి.. ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాలని ఇజ్రాయిల్ విదేశాంగ శాఖ ఆదేశించింది. ఇజ్రాయిల్‌లోని వరల్డ్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ సెంటర్ యాద్ వాషెమ్ డైరెక్టర్ డాని దయాన్.. లావ్రోవ్‌ కామెంట్స్‌ను నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. ఉక్రెయిన్‌ను డీ-మిలిటరైజ్‌, డీ-నాజీఫై చేయడమే టార్గెట్‌ అని రష్యా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
 


Also Read: Illicit Affair: ప్రాణాల మీదకు తెచ్చిన వివాహేతర సంబంధం... అతని మర్మాంగాలు కోసేసిన యువతి


Also Read: హృతిక్‌ రోషన్‌ చేసిన పనికి నా హృదయం ముక్కలైపోయింది.. స్టార్ హీరోయిన్ ఆవేదన!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook