Russia Drops 500kg Bombs on Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇప్పటికే మూడు దఫాలుగా చర్చలు జరిగాయి. అయినా సమస్య ఓ కొలిక్కి రాలేదు. ఫలితంగా యుద్దం కొనసాగుతూనే ఉంది. రష్యా యుద్ద భీభత్సంతో ఉక్రెయిన్ నగరాలు శ్మశానాలను తలపిస్తున్నాయి. ఎటు చూసినా కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలే కనిపిస్తున్నాయి. ఓవైపు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటిస్తూనే.. ఆ వెనువెంటనే రష్యా మరింత దూకుడుగా దాడులకు పాల్పడుతోంది. తాజాగా ఉక్రెయిన్‌లోని సుమీ రీజియన్‌పై రష్యా అత్యంత భీకర దాడులకు పాల్పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత రాత్రి సుమీ నగరంపై రష్యా ఏకంగా 500కేజీల బాంబులతో దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పలు భవనాలు పూర్తిగా ధ్వంసమవగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాయి. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ఒకటి ట్విట్టర్‌లో షేర్ చేశారు.


'చెర్నిహివ్ నగర్‌లోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌పై రష్యా ఈ భయంకరమైన 500 కిలోల బాంబుతో దాడికి పాల్పడింది. అయితే ఈ బాంబు పేలలేదు. రష్యా చేస్తున్న దాడుల్లో ఎంతోమంది అమాయక చిన్నారులు, పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా నుంచి మమ్మల్ని కాపాడండి. గగన తలాన్ని మూసివేయండి. యుద్ధ విమానాలు అందించి మాకు సాయం చేయండి.' అని మంత్రి కులేబా ప్రపంచ దేశాలను అభ్యర్థించారు.


రష్యా రాత్రికి రాత్రే ఈ పెను విధ్వంసానికి పాల్పడిందని ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్ రాజధానికి తూర్పు భాగంలో రష్యా సరిహద్దులో ఉన్న సుమీ రీజియన్‌తో పాటు ఓఖ్టిర్కా ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఓ పవర్ ప్లాంట్‌తో పాటు పలు ఆయిల్ డిపోలు కూడా ధ్వంసమైనట్లు వెల్లడించారు. రష్యా దాడులు రోజురోజుకు మరింత ఉధృతమవుతుండటంతో ఉక్రెయిన్ తల్లడిల్లిపోతోంది. యుద్ధం కారణంగా ఇప్పటికే 17 లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడగా.. వేలాది మంది పౌరులు మృతి చెందారు. 



Also Read: RCB New Captain: 12న కొత్త కెప్టెన్‌ని ప్రకటించనున్న ఆర్‌సీబీ.. ఎవరో తెలుసా?! కోహ్లీకి కూడా ఇష్టమేనట!!


Also Read: మీరు ఎవరు కష్టపడినా.. మా అమ్మే గుర్తుకు వస్తుంది! భావోద్వేగం చెందిన మెగాస్టార్ చిరంజీవి!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook