న్యూడిల్లీ: ప్రపంచాన్ని రోజు రోజుకు కరోనా మహమ్మారి కబళించివేస్తోంది. అయితే రష్యాలోని ఓ ఆసుపత్రిలో కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో గదిలోని వెంటిలేటర్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడికక్కడే కరోనా రోగులు మరణించారు. దీంతో ఆసుపత్రిలో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. వెంటిలేటర్ నుండి మంటలు వ్యాపించి కరోనా రోగులు మరణించారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 


అధిక విద్యుత్ ప్రవాహం కారణంగా వెంటిలేటర్ లో మంటలు వచ్చాయని, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కరోనా రోగుల కోసం నిర్వహిస్తున్న ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు ధ్రువీకరించారు. మృతుల సంఖ్య మాత్రం వెల్లడించలేదు. 150 మంది రోగులను మంటల నుంచి సురక్షితంగా తరలించామని, ఆ ఘటన కనువిప్పు కలిగించిందని దేశవ్యాప్తంగా అప్రమత్త చర్యలు ప్రారంభించామని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు రష్యాలో కరోనా కేసులు సుమారుగా 2 లక్షల 23 వేలకు పెరిగాయని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..