Putin Prepares to Undergo Cancer Surgery: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కు ఏమైంది. త్వరలోనే ఆయన శస్త్రచికిత్స చేయించుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ భద్రతా మండలి కార్యదర్శి పత్రుషేవ్‌ కు తాత్కాలిక బాధ్యతలను అప్పగిస్తారా అంటే ఔననే చెబుతున్నాయి బ్రిటర్‌ మీడియా కథనాలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌ శ్రస్త చికిత్స చేయించుకునేందుకు సిద్ధమయ్యారు.  క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. త్వరలోనే సర్జరీ చేయించుకుంటారని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో దేశ రక్షణతో పాటు ఉక్రెయిన్‌ యుద్ధ  తాత్కాలిక బాధ్యతలను మాజీ ఎఫ్‌ఎస్‌బీ చీఫ్‌ నికోలయ్‌ పత్రుషేవ్‌ కు అప్పగిస్తారని సమాచారం అందుతోంది.  70 ఏళ్ల పత్రుషేవ్‌.. రష్యా భద్రత మండలిలో ప్రస్తుతం కార్యదర్శిగా  ఉన్నారు ఉక్రెయిన్‌ పై యుద్ధ ప్రణాళికలను రచించిన ముఖ్యుల్లో ఈయన కూడా ఒకరు. కీవ్‌ నియో- నాజీలతో కొట్టుమిట్టాడుతున్నదని పుతిన్‌ ఒప్పించిన వ్యక్తి పత్రుషేవ్‌.


శస్త్రచికిత్స తర్వాత పుతిన్‌ స్పృహలోకి రావడానికి కనీసం రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం లేకపోలేదు. సర్జరీ తర్వాత ఎంతకాలం విశ్రాంతి తీసుకుంటారో కచ్చితమైన సమాచారం ఏదీ లేదు. అప్పటివరకు దేశరక్షణ బాధ్యతలను పత్రుషేవ్‌  చూస్తాడు. అయితే సర్జరీ వెళ్తున్న పుతిన్‌ తన అధికారాలను పూర్తిస్థాయిలో బదిలీ చేసేందుకు ఇష్టపడటం లేదని బ్రిటన్‌ మీడియా తెలిపింది.  


ఏప్రిల్‌ లోనే జరగాల్సిన శస్త్రచికిత్సను పుతిన్‌వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మరింత ఆలస్యం చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.  వరల్డ్‌ వార్‌ 2లో  రష్యా విజయానికి గుర్తుగా మే 9న ఆదేశంలో విజయోత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత అయినా లేదంటే ఒకరోజు ముందే పుతిన్‌ ఆపరేషన్‌ చేయించుకుంటారని బ్రిటన్‌ మీడియా తెలిపింది. అటు ఉక్రెయిన్‌ పై పుతిన్‌ పూర్తిస్థాయి యుద్దానికి దిగుతారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి.  గత 18 నెలల నుంచి పుతిన్‌ అబ్డామిన్‌క్యాన్సర్‌ తోపాటు పార్కిన్‌సన్‌ అనేడిజార్డర్‌తో బాధపడుతున్నారు. అయితే ఈ వార్తలను క్రెమ్లిన్‌ కొట్టిపారేస్తోంది. పుతిన్‌ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెబుతోంది.


Also Read: Sarkaru Vaari Paata Trailer: సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్.. మహేశ్‌ బాబు అభిమానులకు పూనకాలే!


Also Read: Hero Siddharth: 'ప్యాన్ ఇండియా' అనే పదమే నాన్‌సెన్స్... హీరో సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook