Hero Siddharth: 'ప్యాన్ ఇండియా' అనే పదమే నాన్‌సెన్స్... హీరో సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు

Hero Siddharth on Pan Indian Films: ప్యాన్ ఇండియా అనే పదమే నాన్‌సెన్స్ అంటున్నాడు హీరో సిద్ధార్థ్. ఇటీవలి పరిణామాలు బాలీవుడ్ వర్సెస్ సౌత్ అన్నట్లుగా సాగుతున్న నేపథ్యంలో ప్యాన్ ఇండియా సినిమాలపై సిద్ధార్థ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 03:24 PM IST
  • ప్యాన్ ఇండియా అనే పదంపై సిద్దార్థ్ అభ్యంతరం
  • అసలు అది అర్థం లేనిదని సిద్ధార్థ్ కామెంట్
  • ప్యాన్ ఇండియాకు బదులు ఇండియన్ సినిమా అనాలన్న సిద్దార్థ్
Hero Siddharth: 'ప్యాన్ ఇండియా' అనే పదమే నాన్‌సెన్స్... హీరో సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు

Hero Siddharth on Pan Indian Films: ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అన్నట్లుగానే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. హిందీతో పోటీగా.. ఇంకా చెప్పాలంటే హిందీని మించి సౌత్ సినిమాలు రాణిస్తున్నాయి. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. బాహుబలితో మొదలైన ఈ పరంపర పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాలతో పీక్స్‌కి వెళ్లింది. ఇండియన్ సినిమాకు సౌత్ సినిమాలు కొత్త నిర్వచనం చెబుతున్న తరుణంలో సౌత్ ఇండస్ట్రీకి, బాలీవుడ్‌కి మధ్య చిచ్చు రాజుకుంది. ఈ నేపథ్యంలో హీరో సిద్దార్థ్ తాజాగా 'ప్యాన్ ఇండియా' సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన అభిప్రాయం ప్రకారం... ప్యాన్ ఇండియన్ అనే పదం అగౌరవంగా ఉందన్నారు. ప్యాన్ ఇండియా అంటే ప్రాంతీయ భాషా చిత్రం అనే అర్థంలో ఉపయోగిస్తున్నారని... బాలీవుడ్ కాకుండా ఇతర భాషల చిత్రాలను సూచించేందుకు ఆ పదాన్ని వాడుతున్నారని పేర్కొన్నారు. ఏ భాషలో తెరకెక్కినా అది ఇండియన్ సినిమానే అని... ప్యాన్ ఇండియా అని పేర్కొనడం నాన్ సెన్స్ అని అన్నారు.

ప్యాన్ ఇండియాకు బదులు ఇండియన్ సినిమా లేదా ఏ భాషలో తెరకెక్కితే ఆ భాషా చిత్రంగా దాన్ని పేర్కొనాలని సిద్ధార్థ్ అభిప్రాయపడ్డారు. 15 ఏళ్ల క్రితం మణిరత్నం 'రోజా' సినిమాను తెరకెక్కిస్తే.. దేశమంతా ఆ సినిమా చూసిందన్నారు. ఆ సమయంలో దాన్ని ప్యాన్ ఇండియా అని ఎవరూ అనలేదని... తమిళ సినిమాగానే గుర్తించారని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ చిత్రం పట్ల తాను గర్వ పడుతున్నానని... ఇది కన్నడ ఇండస్ట్రీలో రూపొందిన ఇండియన్ సినిమా అని అభిప్రాయపడ్డారు.

కాగా, ఇటీవల బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, కన్నడ నటుడు కిచ్చా సుదీప్ మధ్య ట్విట్టర్ వేదికగా లాంగ్వేజ్ వార్ చెలరేగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ వర్సెస్ సౌత్ అన్నట్లుగా ఈ వివాదం సాగింది. బాలీవుడ్ వాళ్లు తమ సినిమాలను తెలుగు, తమిళంలో డబ్బింగ్ చేస్తూ విజయం సాధించడానికి కష్టపడుతున్నారని... అయినా అది జరగడం లేదని... కానీ సౌత్ ఇండస్ట్రీ ఎక్కడైనా సక్సెస్ అయ్యే సినిమాలు చేస్తోందని... హిందీ ఇకపై జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. అయితే హిందీలోకి మీ సినిమాలను ఎందుకు డబ్ చేస్తున్నారంటూ అజయ్ దేవగణ్ సుదీప్ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. అయితే ట్రాన్స్‌లేషన్ లోపం కారణంగా తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ సుదీప్ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో కంగనా లాంటి వాళ్లు అజయ్‌కి మద్దతుగా నిలవగా... తమిళనాడు మాజీ సీఎంలు సిద్ధరామయ్య, కుమారస్వామి సుదీప్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూ కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరి ట్వీట్ వార్‌ బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండస్ట్రీ చర్చకు దారితీసింది.

Also Read; Viral Video: వ్యాయామం చేసేందుకు ప్రయత్నించి జారిపడ్డ వ్యక్తి.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!  

Also Read: IPL 2022: ఎస్ఆర్‌హెచ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ, సుందర్ మళ్లీ దూరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News