Surgical Strike: బాంబులతో దద్దరిల్లుతూ కన్పించే సిరియాలో మరోసారి దాడులు జరిగాయి. సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై రష్యా సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్టు ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిరియాలో (Syria) ఎప్పుడూ కల్లోలమే కన్పిస్తుంది. నిత్యం బాంబు దాడులతో ఆ దేశం తల్లడిల్లుతుంటోంది. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులు సామాన్యులపై చేసే దాడుల నేపధ్యంలో సిరియా పేరు ప్రముఖంగా విన్పించేది. ఈసారి సిరియాలోని ఉగ్రవాదులపై దాడులు జరిగాయి. సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై రష్యా సర్జికల్ స్ట్రైక్స్(Russia Surgical Strikes) జరిపింది. ఈ దాడుల్లో 2 వందల మంది ఉగ్రవాదులు హతమయ్యారని..24 వాహనాలు, 5 వందల కిలోల మందుగుండు సామగ్రి, పేలుడు పదార్ధాల్ని ధ్వంసం చేశామని రష్యా సైన్యం ప్రకటించింది. పల్మైరా ప్రాంతంలో ఉన్న క్యాంపులో ఉగ్రవాదులు పేలుడు పదార్ధాల తయారీలో శిక్షణ పొందుతున్నట్టు తెలిసిందని రష్యా సైన్యం తెలిపింది. ఈ సమాచారం మేరకు తమ సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ జరిపిందని పేర్కొంది. ఇటీవల ఇద్దరు రష్యన్ సైనికుల్ని చంపినట్టు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతీకార చర్యల్లో భాగంగానే రష్యా ఈ దాడులు చేసింది. అయితే ఇస్లామిక్ స్టేట్( Islamic State) రష్యా జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఇంకా ధృవీకరించలేదు. 


Also read: Coronavirus Alert: కరోనా ఉధృతి కారణంగా ఇండియాను రెడ్‌లిస్ట్‌లో చేర్చిన బ్రిటన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook