Coronavirus Alert: కరోనా ఉధృతి కారణంగా ఇండియాను రెడ్‌లిస్ట్‌లో చేర్చిన బ్రిటన్

Coronavirus Alert: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అతి ప్రమాదకరంగా మారింది. ప్రతి రోజూ 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటంతో వివిధ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇండియాలో కరోనా ఉధృతి కారణంగా బ్రిటన్ భారతదేశాన్ని రెడ్‌లిస్ట్‌లో చేర్చింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 20, 2021, 12:05 PM IST
 Coronavirus Alert: కరోనా ఉధృతి కారణంగా ఇండియాను రెడ్‌లిస్ట్‌లో చేర్చిన బ్రిటన్

Coronavirus Alert: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అతి ప్రమాదకరంగా మారింది. ప్రతి రోజూ 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటంతో వివిధ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇండియాలో కరోనా ఉధృతి కారణంగా బ్రిటన్ భారతదేశాన్ని రెడ్‌లిస్ట్‌లో చేర్చింది.

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) పంజా విసురుతూ భయపెడుతోంది. ప్రతిరోజూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిత్యం 2 లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్న నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ (Britain pm Borris Johnson) న్యూఢిల్లీ  పర్యటనను విరమించుకున్నారు. బ్రిటన్‌ ప్రధాని పర్యటన రద్దు చేసుకున్న కొన్ని గంటలకే  భారత్‌ నుంచి బ్రిటన్‌ వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించింది.ఇండియాలో కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ఇండియాను రెడ్‌లిస్ట్ ( India in Red list) ‌లో చేర్చుతున్నామని బ్రిటన్‌ (Britain) ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్కాక్ తెలిపారు. యుకే లేదా ఐరిష్ జాతీయులు మినహా భారతదేశం నుంచి  వచ్చే ప్రయాణికులందరినీ తాత్కాలికంగా  నిషేధిస్తున్నట్లు తెలిపింది.

భారత్‌ నుంచి వచ్చే బ్రిటన్‌, ఐరిష్‌ పౌరులను  10 రోజుల పాటు క్వారంటైన్(Quarantine) ‌లో ఉండాలని తెలిపింది. అంతకుముందు న్యూజిలాండ్‌ (Newzealand) భారత్‌నుంచి వచ్చే ప్రయాణికులను ఏప్రిల్‌ 11 నుంచి రెండు వారాల వరకూ రావద్దని ఆంక్షలు విధించింది.ఇండియాలో గత 24 గంటల్లో 2 లక్షల 59 వేల కేసులు నమోదు కాగా..ఏకంగా 1761 మంది మరణించారు. అంతకుముందు రోజు 2 లక్షల 73 వేల కేసులు నమోదై రికార్డు సాధించింది.

Also read: Corona Cases: భారత్‌కు ప్రయాణాలు చేయవద్దని పౌరులను హెచ్చరించిన అమెరికా ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News