Coronavirus Spread: కరోనా వైరస్ 7 నెలల వరకూ సజీవంగానేనా..నిర్ఘాంతపోయే నిజమిది
Coronavirus Spread: రోజులు గడిచే కొద్దీ కరోనా మహమ్మారి గురించి ఆసక్తికరమైన, ఆందోళన కల్గించే అంశాలే వెలుగు చూస్తున్నాయి. ఒకసారి కోవిడ్ సోకితే..ఆ వైరస్ శరీరంలో ఎప్పటి వరకూ ఉంటుందనేది తెలిస్తే నిర్ఘాంతపోతారు.
Coronavirus Spread: రోజులు గడిచే కొద్దీ కరోనా మహమ్మారి గురించి ఆసక్తికరమైన, ఆందోళన కల్గించే అంశాలే వెలుగు చూస్తున్నాయి. ఒకసారి కోవిడ్ సోకితే..ఆ వైరస్ శరీరంలో ఎప్పటి వరకూ ఉంటుందనేది తెలిస్తే నిర్ఘాంతపోతారు.
కరోనా మహమ్మారి రెండేళ్లుగా విలయ తాండవం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావముంది. దేశంలో కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. మరోవైపు కరోనా వైరస్ గురించి రోజురోజుకూ కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకూ మనకు తెలిసిన దానికంటే ఎక్కువే కరోనా వైరస్ మనిషి శరీరంలో యాక్టివ్‌గా ఉంటుందనేది తాజా పరిశోధన చెబుతోంది. ప్రాంటియల్స్ ఇన్ మెడిసిన్స్ జర్నల్‌లో ఈ కొత్త అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. ఫ్రాన్స్‌కు చెందిన పాస్చర్ ఇనిస్టిట్యూట్, ది యూనివర్శిటీ ఆఫ్ సాన్‌పౌలో, బ్రెజిల్‌కు చెందిన ఆస్వాల్డో క్రజ్ ఫౌండేషన్ కలిసి కరోనా వైరస్ గురించి పరిశోధనలు జరిపాయి. ( How long coronavirus sustain in body after effected, latest study)
కరోనా పాజిటివ్‌గా తేలిన 14 రోజుల తరువాత కూడా కరోనా వైరస్ యాక్టివ్‌గా ఉంటుందనేది తాజా అధ్యయనం చెబుతున్న మాట. కొందరిలో అయితే 7 నెలల తరువాత కూడా యాక్టివ్‌గా ఉంటుందట. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. బ్రెజిల్‌లోని కొందరు రోగులపై వరుస పరీక్షలు జరిపారు. నెగెటివ్ వచ్చేవరకూ..2-3 సార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసినప్పుడు..ఇద్దరు పురుషులు, ఒక మహిళలో కరోనా వైరస్ 70 రోజుల తరువాత కూడా ఉన్నట్టు గుర్తించారు. అంటే కరోనా వైరస్ సోకినవారిలో 8 శాతం మందికి 2 నెలల కంటే ఎక్కువకాలం కరోనా సంక్రమింపజేసే లక్షణాలుంటాయి. 38 ఏళ్ల మరో వ్యక్తిలో 20 రోజులే స్వల్ప లక్షణాలు కన్పించినా..శరీరంలో మాత్రం ఏకంగా 232 రోజుల పాటు వైరస్ ఉన్నట్టు తేలింది. అంతేకాదు శరీరంలోని ఆ వైరస్ పలు మ్యూటేషన్లు చెందినట్టు పరిశోధకులు గుర్తించారు.
కరోనా సంక్రమించిన రెండు వారాల తరువాత కూడా ప్రజలు యాక్టివ్ వైరస్ కలిగి ఉండటమే సంక్రమణకు కారణంగా తెలుస్తోంది. కరోనా సోకినవారు ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకోవడం ద్వారా కొత్త మ్యూటేషన్లు, కొత్త వేరియంట్ల గురించి తెలుసుకోవచ్చంటున్నారు పరిశోధకులు. కొన్ని కేసుల్లో కరోనా వైరస్ యాక్టివ్‌గా ఉండేకాలం 71 రోజుల్నించి 232 రోజుల వరకూ ఉందనేది తాజా అధ్యయనం చెబుతున్న కీలకమైన అంశం. ఇదే ఇప్పుడు కలకలం కల్గిస్తోంది.
Also read: Sitaphal Benefits: ఈ సీజన్‌లో సీతాఫలాలు తిన్నారా..త్వరగా తినండి..సీజన్ ముగిసిపోతోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook