Sitaphal Benefits: భూమ్మీద దొరికే ఫలాల్లో అమృతంలా ఉండేవి సీతాఫలాలు మాత్రమే. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలుండే ఏకైక సీజనల్ ఫ్రూట్ ఇది. అందుకే సీజన్ ముగుస్తోంది..వెంటనే తినేయండి. సీతాఫలంతో కలిగే ఆ అద్భుత ప్రయోజనాలేంటో చూద్దాం..
ఏడాదితోసారి సీజనల్‌గా లభించే సీతాఫలాలతో ఎన్ని రకాల అద్భుతమైన ఆరోగ్యపర ప్రయోజనాలున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో శరీరానికి తప్పనిసరిగా కావల్సిన వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే గుణాలు సీతాఫలాల్లోనే చాలా ఎక్కువ. అక్టోబర్ నుంచి డిసెంబర్ లేదా జనవరి వరకూ లభించే సీతాఫలాల్లో పుష్కలంగా విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి. ప్రస్తుతం సీతాఫలాల సీజన్ దాదాపుగా ముగుస్తోంది. మార్కెట్‌లో ఇంకా ఒకట్రెండు చోట్ల దొరుకుతున్నాయి. ఈ సీజన్‌లో ఒకవేళ మీరు సీతాఫలాలు తినకపోతే..వెంటనే తినేయండి మరి ( Health Benefits of Custard Apple/Sitaphal).
ఇక చక్కెర వ్యాధి ఉన్నవాళ్లు..సీతాఫలాలు తినవచ్చా లేదా..ఆయాసం సమస్య ఉన్నవారు తినవచ్చా లేదా అనే సందేహాలున్నాయి. వాటి గురించి పరిశీలిద్దాం. ప్రతి ఏటా అక్టోబర్ నుంచి డిసెంబర్-జనవరి వరకూ లభించే సీతాఫలాల్లో చాలా పోషక విలువలున్నాయి. అందుకే సీతాఫలాల్ని విటమిన్లు, ఖనిజాలు కలిగి పోషకాల గని అంటారు. ఇక ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసిటీ, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. సీతాఫలాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వారు కూడా సీతాఫలాలు తినవచ్చు.
ఇక సీతాఫలాల్లో పుష్కలంగా లభించే విటమిన్ సి, విటమని ఎ, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి కారణంగా..అల్సర్ల నివారణ, ఎసిడిటీ నియంత్రణ సాధ్యమవుతుంది. ఇందులోని సూక్ష్మ పోషకాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. సీతాఫలాల్లో అధికంగా ఉండే విటమిన్ ఎ కారణంగా కంటి చూపు మెరుగుపడుతుంది. జుట్టు పటిష్టమౌతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇందులో విరివిగా ఉండే ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఇక డైటింగ్ చేసేవారు, బరువు తగ్గాలనుకునేవారికి కూడా సీతాఫలాలు మంచి ఔషధ పండ్లు. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ కారణంగా జీర్ణ సమస్య మెరుగవుతుంది. అయితే ఓ మోతాదుకు మించి మాత్రం సీతాఫలాలు తినకూడదనే హెచ్చరిక కూడా ఉండనే ఉంది. ఇతర ఆరోగ్య సమస్యలున్నవాళ్లు వైద్యుడి సలహా మేరకు అవసరమైన మేర సీతాఫలాలు తీసుకోవల్సి ఉంటుంది.
Also read: Tulsi Water Benefits: తులసి నీళ్లు చల్లడం కాదు..తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook