GOLDEN BLOOD Group: రక్తదానం గొప్ప దానం అని అంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే.. రక్తం దానం చేసి ఆదుకుంటే దేవుడిలా సాయం చేశావంటారు. మానవ శరీరంలో ఎనిమిది రకాల బ్లెడ్ గ్రూపులు ఉండగా.. వారికి సంబంధించిన బ్లెడ్ గ్రూప్‌తో సెట్ అయ్యే రక్తాన్ని ఎక్కిస్తారు. అయితే ఈ 8 గ్రూపులు కాకుండా మనిషి శరీరంలో అరుదైన కొత్త రకం రక్త వర్గాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఈ బ్లెడ్ చాలా విలువైనదని అరుదైనదని చెబుతున్నారు. ప్రపంచంలో కేవలం 45 మంది మాత్రమే ఈ రకం బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నారని పేర్కొంటున్నారు. ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ పేరు గోల్డెన్ బ్లడ్ గ్రూప్.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పురాతన గ్రీస్‌లో దేవతలకు బంగారు రక్తం ఉందని నమ్మేవారని సైన్స్ మ్యూజియం గ్రూప్ చెబుతోంది. దీనిని ఇకర్ అని పిలిచేవారు. అయితే సాధారణ మానవులకు విషపూరితమైనదిగా చెబుతారు. 1961లో 'గోల్డెన్ బ్లెడ్' ఉన్న వ్యక్తిని కనుగొన్నారు. దాని అరుదైన, అపారమైన శాస్త్రీయ ప్రాముఖ్యత కారణంగా ఇది బంగారు రక్తం అని పిలిచేవారు. చాలా కాలంగా ఈ అరుదైన రక్తం గురించి ప్రజలకు తెలియకుండా దాచి ఉంచారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతి సమాచారం ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది.


ఈ రక్తం ఎందుకు అరుదు..?


ఇది చాలా అరుదుగా కనిపించే బ్లడ్ గ్రూప్. ఇది మనుషులకు అమరత్వం పొందే శక్తిని ఇవ్వనప్పటికీ.. దానిలో చుక్కలవారీగా ఉండే ద్రవం ప్రాణాలను రక్షించే లక్షణాలు కలిగి ఉంటుందని అంటున్నారు. నిజానికి ఈ రక్తాన్ని ఏ బ్లడ్ గ్రూప్‌తోనైనా మనుషుల శరీరంలో ఎక్కించవచ్చు. అయితే ఈ తరహా బ్లడ్ గ్రూప్‌ చాలా అరుదుగా కనిపిస్తుంది. ప్రపంచంలో బ్లడ్ గ్రూప్ ఉన్న 45 మందిని గుర్తించారు. అయితే వీరిలో 9 మంది మాత్రమే రక్తదానం చేసే పరిస్థితిలో ఉన్నట్లు తేలింది. మిగిలిన 36 మందిలో కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరికొంత మంది రక్తదానం చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ బ్లడ్ గ్రూప్ చాలా రేర్ కాబట్టి ఒక చుక్క రక్తం ధర ఒక గ్రాము బంగారం కంటే ఎక్కువట. అందుకే దీన్ని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు.


మనిషి శరీరంలో ఈ బ్లడ్ గ్రూపులు ఉండడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది 'జెనెటిక్ మ్యుటేషన్' కారణంగా ఇది ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అవుతుంది. 'నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్'లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. చాలా సన్నిహిత సంబంధాల మధ్య, ముఖ్యంగా బంధువులు, తోబుట్టువులు లేదా ఇతర బంధువుల మధ్య వివాహం కారణంగా, వారి పిల్లలలో బంగారు రక్తం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూప్‌కు చెందిన వ్యక్తులు రక్తహీనతకు గురయ్యే ప్రమాదం ఉంది. బ్రిటన్‌లో దీనిపై చాలా పరిశోధనలు జరిగాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తుల పేర్లను బయటకు వెల్లడించరు.


Also Read: Bigg Boss 6 Telugu Prize Money : బిగ్ బాస్ షోలో కొత్త పథకం.. ప్రైజ్ మనీలో కోతలు.. చివరకు మిగిలేది ఎంతంటే?


Also Read: Super Star Krishna: అపురూపమైన జ్ఞాపకం.. సెలవిక సూపర్ స్టార్ కృష్ణ.. విజయశాంతి ఎమోషనల్   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook