Lions Infected Covid 19: మనుషుల నుంచి సింహాలకు కరోనా.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సైంటిస్టులు
Lions Infected Covid 19 : శ్వాస కోశ సమస్యలు, ముక్కు కారడం, పొడి దగ్గు వంటి లక్షణాలు బయటపడటంతో.. ఆ మూడు సింహాలను క్వారెంటైన్‌కి తరలించారు. దాదాపు 15 నుంచి 25 రోజుల వ్యవధిలో ఆ మూడు సింహాలు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాయి.
Lions Infected Covid 19 : దక్షిణాఫ్రికాలో (South Africa) కోవిడ్ 19 వ్యాప్తికి సంబంధించి 'రివర్స్ జూనోటిక్ ట్రాన్స్‌మిషన్'ని (Reverse Zoonotic Transmission) అక్కడి సైంటిస్టులు గుర్తించారు. ఇటీవలి పరిశోధనల ద్వారా మనుషుల నుంచి సింహాలకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దక్షిణాఫ్రికాలోని గౌతెంగ్ ప్రావిన్స్‌లో ఉన్న ఓ ప్రైవేట్ జూపార్క్‌లో గతేడాది చివరలో మూడు సింహాలు అనారోగ్యం బారినపడగా... సైంటిస్టులు వాటిపై పరిశోధనలు జరిపారు. పరిశోధనల్లో జూపార్క్‌లోని జంతు సంరక్షణ సిబ్బంది ద్వారా వాటికి కరోనా సోకినట్లు తేలింది. లక్షణాలు లేని (Asymptomatic) జంతు సంరక్షకుల నుంచి సింహాలకు కరోనా సోకినట్లు వెల్లడైంది.
ప్రిటోరియా యూనివర్శిటీలోని మెడికల్ వైరాలజీ విభాగానికి చెందిన జూనోటిక్, అర్బో-అండ్ రెస్పిరేటరీ వైరస్ ప్రోగ్రామ్ హెడ్ ప్రొఫెసర్ మేరీట్జీ వెంటర్ నేత్రుత్వంలో ఈ పరిశోధన జరిగింది. పరిశోధనకు సంబంధించిన వివరాలను 'Viruses'అనే జర్నల్‌లో ప్రచురించారు. ఆ వివరాల ప్రకారం.. అనారోగ్యానికి గురైన ఏఢు వారాల తర్వాత ఆ మూడు సింహాలకు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వాటి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించగా డెల్టా వేరియంట్ (Delta Variant) సోకినట్లు తేలింది.
శ్వాస కోశ సమస్యలు, ముక్కు కారడం, పొడి దగ్గు వంటి లక్షణాలు బయటపడటంతో వాటిని క్వారెంటైన్‌కి తరలించారు. దాదాపు 15 నుంచి 25 రోజుల వ్యవధిలో ఆ మూడు సింహాలు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాయి. యాంటీ ఇన్‌ఫ్లేమటరీ డ్రగ్స్, సపోర్టివ్ కేర్ ద్వారా ఆ మూడు సింహాలు కోలుకోగలిగాయని.. యాంటీ బయాటిక్ ట్రీట్‌మెంట్ వాటికి పనిచేయలేదని సైంటిస్టులు వెల్లడించారు.
జూపార్క్‌లో పనిచేసే సిబ్బందికి వ్యాక్సిన్లు ఇవ్వడం, జంతువులకు వారు ఆహారం అందించే సమయంలో ముఖానికి మాస్కులు ధరించడం, జంతువుల బోన్లను శానిటైజ్ చేయడం ద్వారా వాటికి కరోనా (Covid 19 Cases) సోకకుండా జాగ్రత్తపడవచ్చునని సైంటిస్టులు సూచించారు. లేనిపక్షంలో జంతువులకు కరోనా సోకి.. వాటి ద్వారా కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదన్నారు. ఆ వేరియంట్లు తిరిగి మనుషులకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Also Read: టాలీవుడ్‌లో విషాదం... అనారోగ్యంతో కన్నుమూసిన నటుడు కొంచాడ శ్రీనివాస్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook