Konchada Srinivas: టాలీవుడ్‌లో విషాదం... అనారోగ్యంతో కన్నుమూసిన నటుడు కొంచాడ శ్రీనివాస్..

Actor Konchada Srinivas Death: ప్రతీ సంక్రాంతికి శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి కాశీబుగ్గకు వెళ్లి కుటుంబంతో పండగను జరుపుకుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పండగ నిమిత్తం కాశీబుగ్గ వెళ్లారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్న సమయంలోనే ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 08:36 AM IST
  • తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం
  • అనారోగ్యంతో నటుడు కొంచాడ శ్రీను కన్నుమూత
  • శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి
Konchada Srinivas: టాలీవుడ్‌లో విషాదం... అనారోగ్యంతో కన్నుమూసిన నటుడు కొంచాడ శ్రీనివాస్..

Actor Konchada Srinivas Death: టాలీవుడ్ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో బుధవారం (జనవరి 19) మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా పలాస పరిధిలోని కాశీబుగ్గలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ కన్నుమూశారు. శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్రతీ సంక్రాంతికి శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి కాశీబుగ్గకు వెళ్లి కుటుంబంతో పండగను జరుపుకుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పండగ నిమిత్తం కాశీబుగ్గ వెళ్లారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్న సమయంలోనే ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. శ్రీనివాస్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

గతంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో శ్రీనివాస్ కిందపడిపోవడంతో ఛాతి భాగంలో అతనికి దెబ్బ తగిలిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయించగా... శ్రీనివాస్‌కు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు తెలిసిందన్నారు. అప్పటినుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు.

కొంచాడ శ్రీనివాస్ టాలీవుడ్‌లో (Tollywood) సుమారు 40కి పైగా చిత్రాల్లో నటించారు. సుమారు 10 టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. శంకర్‌దాదా ఎంబీబీఎస్, ఆది, ప్రేమ కావాలి వంటి చిత్రాలు శ్రీనివాస్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. శ్రీనివాస్‌ తల్లి విజయలక్ష్మి కాశీబుగ్గలో నివసిస్తున్నారు. ఆయన తండ్రి ఐదేళ్ల క్రితం చనిపోగా.. సోదరుడు పదేళ్ల క్రితం చనిపోయాడు. శ్రీనివాస్ మృతిపై చిత్రపరిశ్రమకు చెందిన పలువురు విచారం వ్యక్తం చేశారు.

Also Read : Team India - Covid 19: టీమిండియాలో కరోనా కలకలం.. కెప్టెన్‌ సహా ఆరుగురికి పాజిటివ్‌!!

Also Read: Gold Price Today: బ్యాడ్ ‏న్యూస్: దేశంలో ఒక్కసారిగా పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News