పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహీద్ ఖాఖన్ అబ్బాసీ మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఓ అరుదైన ఘనత సాధించారు. టర్కీష్ టి129 మిలట్రీ హెలికాప్టర్‌లో ప్రయాణించి, ఆ ఘనత సాధించిన తొలి పాక్ ప్రధానిగా వార్తల్లోకెక్కారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం ఈ టెస్ట్ ఫ్లయిట్‌లో ప్రయాణించిన ఆయన దానిని ఓ మంచి ప్రమాణాలు కలిగిన హెలికాఫ్టర్‌గా అభివర్ణించారు. ప్రస్తుతం పాకిస్తాన్ టర్కీష్ ఎయిరోస్పేస్ ఇండస్ట్రీస్ తయారుచేస్తున్న ఈ విమానాలను కొనే యోచనలో ఉంది.


ఈ విమానం మీద ప్రశంసలు వర్షం కురిపించిన పాక్ ప్రధాని, టర్కీష్ అధ్యక్షుడు రేకెప్ తయ్యిప్ ఎర్డోగన్ తమ దేశ రక్షణ వ్యవస్థలో సాధిస్తున్న పురోగతిని కూడా మెచ్చుకున్నారు.


అంతకు క్రితమే పాక్ ప్రధాని, ఈ హెలికాఫ్టర్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలను టర్కీష్ ఏవియేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.  వైవిధ్యమైన యుద్ధ విమానాలు తయారుచేయగల దేశాల్లో ప్రస్తుతం టర్కీ కూడా ఒకటిగా చెలామణీ అవుతోంది.