పాక్ మాజీ ప్రధాని న‌వాజ్ ష‌రీఫ్‌కు ఊహించని షాక్ త‌గిలింది. లండన్‌లో షరీఫ్‌కి అక్రమాస్తులు ఉన్నాయనే ఆరోపణల వస్తున్న క్రమంలో ఆయన మీద ఛార్జిషీటు దాఖలు చేయాల్సిందిగా పాకిస్థాన్‌ న్యాయస్థానం నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరోని  ఆదేశించింది. షరీఫ్‌‌తో పాటు ఆయన కుమార్తె మరియం నవాజ్‌, ఆమె భర్త మాజీ కెప్టెన్‌ మొహ్మద్‌ సఫ్దార్‌పై కూడా ఛార్జిషీటు చేయాల్సిందిగా కోర్టుగా ఆదేశించింది.  షరీఫ్‌ తరపు న్యాయవాది ఛార్జిషీటు ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా కోరినప్పటికీ  న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. మనీ లాండిరింగ్‌తో ఇతర కేసులు కూడా నమోదైనందున వాయిదా కుదరదని 
తెలిపింది. ప్రస్తుతం పనామా గేట్‌ కేసులో నవాజ్‌షరీఫ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా నిందితులుగా ఉన్నారు. పాక్‌ సుప్రీంకోర్టు జులై 28న నవాజ్ షరీఫ్‌ను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.