పోల్ డ్యాన్స్‌తో రెచ్చిపోయిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్
ఓ పాఠశాలలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది
ఓ పాఠశాలలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. స్కూల్‌లో జాయిన్ అయ్యేందుకు వచ్చిన పిల్లలకు వెల్‌కమ్ చెప్పేందుకు స్కూల్ ప్రిన్సిపాల్ విన్నూతంగా ఆహ్వానం పలకగా.. దానిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలోని ఓ కిండర్‌గార్టెన్ స్కూల్‌లో కొత్తగా జాయిన్ అవడానికి వచ్చిన పిల్లలకు.. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పోల్ డ్యాన్స్‌తో ఆహ్వానం పలికాడు. ఈ సంఘటన చైనా నగరమైన షెన్జెన్‌లో జరిగినట్లు WION నివేదించింది.
వివరాల్లోకి వెళితే.. షెన్జెన్ నగరానికి చెందిన దంపతులు తమ పిల్లాడిని కిండర్‌గార్టెన్ స్కూల్‌లో చేర్పించాలని భావించి.. దగ్గరలో ఉన్న ఓ కిండర్‌గార్టెన్ స్కూల్‌కు పిల్లవాడితో కలిసి వెళ్లారు. అప్పటికే అక్కడ కొందరు పేరెంట్స్ వారి పిల్లలను చేర్పించడానికి వచ్చారు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన పిల్లలను ఘనంగా ఆహ్వానించాలనుకొని.. సదరు స్కూల్ ప్రిన్సిపాల్ మహిళా డ్యాన్సర్‌తో పోల్ డ్యాన్స్ ఏర్పాటు చేశాడు. దాంతో అక్కడున్న పేరెంట్స్ ఆశ్చర్యపోయారు.
పోల్ డ్యాన్స్ ఏర్పాటు చేయడం పట్ల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌పై మండిపడ్డారు. దాంతో ప్రిన్సిపాల్ చేసిన తప్పుకు క్షమించమని పిల్లల తల్లిదండ్రులను వేడుకున్నాడు. ఈ మొత్తం సంఘటనంతా అక్కడ ఉన్న చైనా రైటర్ మైఖేల్ స్టాండేర్ట్ వీడియో షూట్ చేసి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోల్ డ్యాన్స్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరలవుతున్నాయి. ఆ వీడియోను మీరూ చూడండి..