America Planes Crash Video: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో శనివారం జరిగిన డల్లాస్ ఎయిర్ షోలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు సైనిక విమానాలు ఆకాశంలో ఢీకొన్నాయి. దీంతో రెండూ విమానాల్లో మంటలు చెలరేగడంతో నేలమీద కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే విమానంలో ఎంత మంది ఉన్నారనే పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు. విమానాలు ఆకాశంలో ఢీకొన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రమాదం నగరంలోని డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్‌లో మధ్యాహ్నం 1.20 గంటలకు జరిగింది. ప్రమాదం అనంతరం అత్యవసర సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. డల్లాస్ మేయర్ ఎరిక్ జాన్సన్ మాట్లాడుతూ .. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఎయిర్‌పోర్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకుందని తెలిపారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖలు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు.


 




ఆంథోనీ మోంటోయా అనే వ్యక్తి విమానాలు ఢీకొట్టడాన్ని చూశాడు. "నేను అక్కడ నిలబడి ఉన్నాను. రెండు విమానాలు ఒక్కసారిగా ఢీకొట్టడంతో షాక్‌కు గురయ్యా. కాసేపు నాకు ఏమీ అర్థం కాలేదు. నాతోపాటు అందరూ షాక్‌లో ఉన్నారు.." అని ఆయన చెప్పుకొచ్చారు. 


వెటరన్స్ డే సందర్భంగా నిర్వహించిన ఈ ఎయిర్‌ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని డౌన్‌టౌన్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్‌ వద్ద జరిగిన ఘటనకు అత్యవసర సిబ్బంది పరుగులు పెట్టి సహాయక చర్యలు చేపట్టారు.


 



 


Also Read: Pak Vs Eng Final: పాకిస్థాన్-ఇంగ్లండ్ ఫైనల్‌ పోరు.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఈ అమ్మాయి  


 Also Read: PAK Vs ENG: బిగ్‌ ఫైట్‌కు పాకిస్థాన్, ఇంగ్లండ్ రెడీ.. డ్రీమ్ 11 టీమ్‌పై ఓ లుక్కేయండి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి