South Korea: దక్షణి కొరియా అధ్యక్షుడు మూన్‌ జే-ఇన్‌ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కుక్క మాంసం తినడాన్ని బ్యాన్(Ban) చేస్తున్నట్లు సోమవారం ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంవత్సరానికి 1 మిలియన్‌ కుక్కలు తింటున్నారు.. 
కుక్క మాంసం చాలాకాలంగా దక్షిణ కొరియా(South Korea) వంటకాలలో భాగంగా ఉంది. అక్కడ సంవత్సరానికి సుమారు 1 మిలియన్‌ కుక్కలు తింటారని అంచనా. అయితే మనుషులు కాలక్రమేణా పశువుల కంటే ఎక్కువగా జంతువులను సహచరులుగా చూస్తుండటంతో వీటి వినియోగం తగ్గింది. 


Also Read: Cannibal Couple: 30మందిని పైగా చంపి తిన్న నరమాంస దంపతులు... ఎక్కడంటే..??


మరోవైపు జంతు హక్కుల కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. దక్షిణ కొరియలో పెంపుడు జంతువులను పెంచకోవడం, ఇంట్లో కుక్కల(Dogs)తో నివసించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌(Moon Jae-in) ఒక​ ప్రసిద్ధ జంతు ప్రేమికుడు. ఆయన కార్యాలయంలో అనేక కుక్కలను పెంచుకుంటున్నారు.  


దక్షిణ కొరియా జంతు సంరక్షణ చట్టం(Animal Protection Act).. ప్రధానంగా కుక్కలు, పిల్లుల క్రూరమైన వధను అడ్డుకోవడానికి ఉద్దేశించబడిందే కానీ వినియోగాన్ని నిషేధించదు. ఈ నెలలో చేసిన ఓ సర్వే రిపోర్ట్ ప్రకారం 78% మంది కుక్క, పిల్లి మాంసం ఉత్పత్తులను, విక్రయాలను నిషేదించాలని కోరగా, 49% మంది మాంసం వినియోగ(Meat consumption) నిషేదాన్ని సమర్థించారు. అయితే మాంసం విక్రేతలు తమ వృత్తిపై హక్కు కోసం పట్టుబడుతూ, వారి జీవనోపాధి ప్రమాదంలో ఉందని చెప్తున్నారు.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


pple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి