Srilanka Crisis: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం విడిచి పారిపోయారని తెలియడంలో వేలాది మంది ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. ఆందోళనకు దిగారు. పశ్చిమ శ్రీలంకలో పరిస్థితులు చేయి దాటిపోయాయి. దీంతో ఎమర్జెన్సీ విధించారు అధికారులు. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులపై సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది. అయినా వేలాదిమంది నిరసనకారులు అధ్యక్ష భవనంతో పాటు ప్రధానమంత్రి అధికార నివాసం దగ్గరకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం విడిచిపారిపోయారు. తన పదవికి ఇవాళ రాజీనామా చేస్తానని గొటబయ గతంలో ప్రకటించారు. అయితే రాజీనామా చేసేందుకు కొన్ని షరతులు పెట్టారని తెలుస్తోంది. తనను దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి ఇస్తేనే రాజీనామా చేస్తానని చెప్పారని తెలుస్తోంది. దీంతో అర్దరాత్రి తర్వాత అధికారలే గొటబయ రాజపక్సేను ప్రత్యేక విమానంలో దేశం నుంచి బయటికి పంపించారని సమచారం. బుధవారం తెల్లవారు జామున గొటబయ రాజపక్సే మాల్దీవులకు పారిపోయారు.మాలేలోని వెలానా విమానాశ్రయంలో గొటబయకు మాల్దీవుల ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికారు. అధ్యక్షుడు రాజపక్సే, అతని భార్య, ఇద్దరు అంగరక్షకులు గత రాత్రి కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మేల్-బౌండ్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో వెళ్లిపోయారు.మాల్దీవులకు వెళ్లిన గొటబయ రాజపక్సే ఇవాళ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.



Read also: Vijay Devarakonda: దేవరకొండతో డేటింగ్ చేయలనుందన్న సారా.. విజయ్ షాకింగ్ రిప్లై!


Read also: CNOS Survey: ముఖ్యమంత్రుల పనితీరుపై లేటెస్ట్ సర్వే.. జగన్, కేసీఆర్ ర్యాంక్ ఎంతో తెలుసా?    



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook