Srilanka Crisis: లంక అల్లకల్లోలం... కనిపిస్తే కాల్చిపారేయాలంటూ సైన్యానికి అధ్యక్షుడి ఆదేశాలు...
Shoot at Sight Orders in Srilanka: శ్రీలంక పరిస్థితి నానాటికి దిగజారుతోంది. ప్రజల్లో చెలరేగిన అశాంతి హింసాత్మక ఘటనలకు దారితీయడంతో దేశం అల్లకల్లోలంగా మారింది.
Shoot at Sight Orders in Srilanka: ఆర్థిక సంక్షోభం తర్వాత శ్రీలంక ప్రజల్లో చెలరేగిన అశాంతి ఆ దేశాన్ని అట్టుడికేలా చేస్తోంది. రోజురోజుకు అక్కడి పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కుటుంబానికి చెందిన పలువురు రాజకీయ నేతల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. ప్రజల ఆగ్రహవేశాలు చూసి రాజకీయ నేతలు దేశాన్ని వీడిపోతున్నారనే కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు రాజపక్స శ్రీలంక ఆర్మీకి సంచలన ఆదేశాలిచ్చారు. అరాచక శక్తులను ఏరిపారేసేందుకు.. కనిపిస్తే కాల్చివేత ఆర్డర్స్ ఇచ్చారు.
ఎక్కడ ఏ విధ్వంసం చేసినా... ఎవరికి ఏ హాని తలపెట్టినా... దోపిడీకి పాల్పడినా... వారిని కాల్చిపారేయాలని అధ్యక్షుడు ఆర్మీకి ఆదేశాలిచ్చారు. సోమవారం (మే 9) జరిగిన హింసాత్మక ఘటనల్లో అధికార పార్టీకి చెందిన ఓ నేత, పోలీస్ అధికారి సహా మొత్తం 8 మంది మృతి చెందారు. మరో 219 మంది వరకు గాయపడ్డారు. హింసాత్మక ఘటనలకు అధికార పార్టీ మద్దతుదారులే కారణమన్న విమర్శలున్నాయి.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై మహీంద రాజపక్స మద్దతుదారులు దాడులకు పాల్పడటం వల్లే హింసాత్మక ఘటనలు మొదలయ్యాయి. ప్రధానిగా రాజపక్స రాజీనామా తర్వాత ఆయన మద్దతుదారులు కొందరు ఆందోళనకారులపై దాడులకు తెగబడ్డారు. దీంతో రాజపక్స అనుచరులు, మద్దతుదారులే లక్ష్యంగా ఆందోళనకారులు ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారు.
ప్రజల అశాంతి, దాడుల నేపథ్యంలో పలువురు శ్రీలంకలో ఇండియన్ మిలటరీని దింపుతున్నారన్న ప్రచారాన్ని అక్కడి ఇండియన్ హైకమిషన్ తోసిపుచ్చింది. మహీంద రాజపక్స, ఆయన కుటుంబ సభ్యులు శ్రీలంక నుంచి భారత్‌కు పారిపోయారనే వార్తలను కూడా ఇండియన్ కమిషన్ తోసిపుచ్చింది. దేశం హింస, ఆందోళనలతో అట్టుడుకుతుండటంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కర్ఫ్యూని గురువారం వరకు పొడగించారు. ప్రజలు ఇకనైనా హింసా మార్గాన్ని వీడాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Mehabooba Song Video: కేజీఎఫ్ 2 రొమాంటిక్ సాంగ్ మెహబూబా వీడియో వచ్చేసింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.