Srilanka New President Ranil Wickremesinghe: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. లంక పార్లమెంట్‌లో విక్రమ సింఘే పార్టీకి ఒకే ఒక్క సభ్యుడు ఉన్నప్పటికీ అధికార పార్టీ మద్దతుతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బుధవారం (జూలై 20) లంక పార్లమెంట్‌లో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరిగిన ఓటింగ్‌లో రణిల్ విక్రమసింఘేకి 134 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓటులో స్పష్టమైన మెజారిటీతో విక్రమసింఘే గెలుపొందారు. విక్రమసింఘేకి ప్రధాన పోటీదారుగా ఉన్న డల్లాస్ అలహప్పెరుమాకి 84 ఓట్లు వచ్చాయి. వామపక్ష నేత అనురా దిస్సనాయకేకి కేవలం 3 ఓట్లు మాత్రమే పోల్ అవడం గమనార్హం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంక పార్లమెంట్‌లో మొత్తం 225 మంది సభ్యులు ఉన్నారు. ఇవాళ జరిగిన ఓటింగ్‌లో 219 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. పార్లమెంట్‌లో రణిల్ విక్రమ సింఘేకి చెందిన యునైట్ నేషనల్ పార్టీకి కేవలం ఒక ఎంపీ మాత్రమే ఉన్నప్పటికీ అధికార ఎస్‌ఎల్‌పీపీ ఎంపీలు ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న విక్రమ సింఘే త్వరలోనే అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.


నిజానికి ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ రణిల్ విక్రమసింఘేపై కూడా ప్రజాగ్రహం వ్యక్తమైంది. కానీ విక్రమ సింఘే మాత్రం తన పదవికి రాజీనామా చేయలేదు.ఈ ఏడాది మే నెలలో మహింద రాజపక్స రాజీనామతో అనూహ్యంగా విక్రమ సింఘే ప్రధాని అయ్యారు. సంక్షోభం ముదిరి అధ్యక్షుడు దేశం వదిలి పారిపోవడం.. తన పదవికి రాజీనామా చేయడంతో విక్రమ సింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మెజారిటీ ఎంపీలు విక్రమ సింఘేకి జై కొట్టడంతో లంక అధ్యక్షుడిగా ఆయన పగ్గాలు చేపట్టనున్నారు. విక్రమ సింఘే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అయిన లంక సంక్షోభం నుంచి బయపడుతుందా లేదా చూడాలి. 


Also Read: Srilanka Crisis: గొటబాయ రాజపక్స రాజీనామా.. లంక తదుపరి అధ్యక్షుడు ఎవరు.. ఫ్రంట్ రన్నర్స్‌గా ఆ ముగ్గురు..!


Also Read: Sithara: అప్పుడే పదేళ్లా.. సితారకు మహేష్-నమ్రతలు ఎమోషనల్ విషెస్


 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook