తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన 69 జాలర్లను శ్రీలంక ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. అయితే ఇంకా 71 మంది శ్రీలంక జైళ్ళల్లో మగ్గుతున్నట్లు సమాచారం. గతంలో చేపల వేటకని వెళ్లి అనుకోకుండా శ్రీలంక తీరాన్ని దాటిన అనేకమంది భారతీయులపై ఆ ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ సంవత్సరం మొత్తం 81 మంది భారతీయ జాలర్లను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విడుదల చేసిన జాలర్లను ఇండియన్ కోస్ట్ గార్డు అధికారులకు శ్రీలంక నావికాదళ అధికారులు అప్పగించినట్లు సమాచారం. గతంలో శ్రీలంక నావికాదాళం తమిళ జాలర్లను కట్టడి చేసిన అనేక సంఘటనలు ఉన్నాయి. ఇదే సంవత్సరం ధనుష్కోటి సమీపంలో సముద్రంలో నాటుపడవలతో చేపలవేట సాగిస్తున్న రామేశ్వరం జాలర్లపై శ్రీలంక నావికాదళ అధికారులు దాడులు జరిపారు.