Kabul Stampede: ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఆఫ్ఘన్ నుంచి బయటపడేందుకు కాబూల్ విమానాశ్రయం వద్దకు పెద్దఎత్తున జనం చేరుకున్న క్రమంలో భారీగా తొక్కిసలాట జరిగి..ప్రాణనష్టం సంభవించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాలిబన్ల (Talibans)ఆక్రమణతో ఆఫ్ఘన్‌లో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. తాలిబన్లపై భయంతో అక్కడ్నించి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు అటు అమెరికా, ఇండియా దేశాలు వైమానిక విమానాల ద్వారా ప్రజల్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కాబూల్ విమానాశ్రయం వద్దకు పెద్దఎత్తున ప్రజలు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాబూల్ విమానాశ్రయం(Kabul Airport)బయట మెయిన్ గేట్ వద్ద జనం పెద్దఎత్తున గుమిగూడారు. జనాన్ని చెదరగొట్టేందుకు తాలిబన్లు గాలిలో కాల్పులు జరపడంతో భారీఎత్తున తొక్కిసలాట(Stampede)చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో 7గురు ఆఫ్ఘన్ పౌరులు అక్కడికక్కడే మరణించారని బ్రిటీష్ మిలిటరీ వెల్లడించింది. 


మరోవైపు ఇవాళ ఉదయం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు(Indian Airforce)చెందిన ఏసీ 17 విమానం 168 మంది ప్రయాణీకులతో ఆఫ్ఘన్ నుంచి ఇండియాకు చేరింది. ఘజియాబాద్‌లోని హిండెన్ ఎయిర్‌బేస్‌కు చేరిన విమానంలో 107 మంది భారతీయులు, 20 మంది ఆఫ్ఘన్ హిందూ, సిక్కులు ఉన్నారు. 168 మందికి ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్షలు చేసిన తరువాతే బయటకు పంపుతామని అధికారులు తెలిపారు. అటు అమెరికా , నాటో విమానాల ద్వారా కూడా కాబూల్ నుంచి దోహాకు తరలించిన 135 మంది ఇండియాకు చేరుకున్నారు. 


Also read: Joe Biden: ప్రాణాలకు ముప్పు లేకుండా తరలింపు సాధ్యం కాదంటున్న జో బిడెన్