Sputnik v Vaccine: మీరు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తీసుకున్నారా..అయితే 3 రోజులు ఆ పనికి దూరంగా ఉండండి
Sputnik v Vaccine: కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయంలో ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా సందేహాలున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నాక దేనికి అనుమతి ఉంది..దేనికి లేదనేది స్పష్టత లేకపోయినా..ఆ దేశం మాత్రం ఓ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది.
Sputnik v Vaccine: కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయంలో ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా సందేహాలున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నాక దేనికి అనుమతి ఉంది..దేనికి లేదనేది స్పష్టత లేకపోయినా..ఆ దేశం మాత్రం ఓ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది.
కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination) వివిధ దేశాల్లో విస్తృతంగా కొనసాగుతోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక డూస్ అండ్ డోన్ట్ విషయంలో ఇంకా అస్పష్టత నెలకొంది. తిండి విషయంలో ఏ విధమైన మినహాయింపుల్లేవని కొంతమంది చెబుతుంటే..మరి కొద్దిమంది మాత్రం నాన్ వెజ్ తీసుకోకూడదని..ఆల్కహాల్ సేవించకూడదని చెబుతున్నారు. ఇంకొందరైతే అన్నీ తీసుకోవచ్చంటున్నారు. ఈ నేపధ్యంలో రష్యా ప్రభుత్వం చేసిన ప్రకటన ఆశ్చర్యం కల్గిస్తోంది.
రష్యాలో స్పుత్నిక్ వి (Sputnik v)వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఇప్పటికే 13 శాతం జనాభా వ్యాక్సిన్ వేయించుకున్నారు. యూరప్ దేశాల్లో 30 శాతం వరకూ వ్యాక్సినేషన్ పూర్తయింది. రష్యన్ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)గానీ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ గానీ అనుమతివ్వకపోయినా..స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు అనుమతి లేదు. అయినా 47 దేశాల్లో స్పుత్నిక్ వి వ్యాక్సినేషన్ జరుగుతోంది.రష్యాలో(Russia) స్పుత్నిక్ వి వ్యాక్సినేషన్ వేగవంతం కాకపోవడానికి కారణం వ్యాక్సిన్‌పై ప్రజల్లో నమ్మకం లేకపోవడమే. అటు ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం లేదనే విమర్శలున్నాయి. ఈ తరుణంలో ఆ దేశం జారీ చేసిన కొత్త నిబంధనలు ప్రజలకు ఆశ్చర్యం కల్గిస్తున్నాయి.
స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తీసుకున్న తరువాత 3 రోజుల పాటు సెక్స్‌కు ( Stay away from sex if you have sputnic v )దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రష్యా ఉప ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ డెనిస్ గ్రైఫెర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తీసుకున్నాక...3 రోజుల వరకూ సెక్స్‌లో పాల్గొనకూడదని తెలిపారు. సెక్స్ అనేది ఎక్కువ ఎనర్జీతో కూడుకున్న వ్యవహారమని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఏ విధమైన ఫిజికల్ యాక్టివిటీ ఉండకూడదని..అందులో సెక్స్ కూడా ఉందని తెలిపారు. ఇప్పటికే మందకొడిగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో..ఇలాంటి నిబంధనలు తోడైతే వ్యాక్సినేషన్ మరింత ఆలస్యం కానుందనే విమర్శలు పెరుగుతున్నాయి.
Also read: Corona Variants Attack: కరోనా వైరస్‌లో మార్పు, రెండు వేరియంట్లతో దాడి చేస్తున్న వైనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook