Taiwan Earth Quake: తైవాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. మద్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. నష్టం ఏ మేరకు జరిగిందనేది మాత్రం ఇంకా తెలియలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తైవాన్ (Taiwan)దేశం ఒక్కసారిగా కదిలిపోయింది. దేశంలోని ఇలాన్ నగరంలో మద్యాహ్నం 1 గంట 11 నిమిషాలకు 6.5 తీవ్రతతో భూమి కంపించింది. అమెరికన్ జియోలాజికల్ సర్వే భూకంప తీవ్రతను 6.2గా వెల్లడించింది. ఇలాన్ నగరంలో 62 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు అంచనా వేశారు. దాదాపు అర నిమిషం పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ముందు 6.5 తీవ్రతతోనూ(6.5 on Richter Scale) తరువాత 5.4 తీవ్రతతోనూ ప్రకంపనలు వచ్చాయి. అయితే భూకంపంలో భారీ నష్టంపై ఇంకా ఏ విధమైన సమాచారం లేదు. భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గోడలు కంపించాయి. మెట్రోసిస్టమ్ ముందు జాగ్రత్తగా కాస్సేపు నిలిపివేశారు. తైవాన్ ప్రజలు భూకంప భయంకర క్షణాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని..గది అద్దాలు పగిలిపోయాయని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.


తైవాన్ దేశం..రెండు టెక్టానిక్ ప్లేట్‌లకు సమీపంలో ఉండటంతో భూకంపాలు (Earth Quake)ఇక్కడ తరుచూ సంభవిస్తుంటాయి. 2018లో 6.4 తీవ్రతతోనే భూకంపం సంభవించగా 17 మంది మరణించారు. దాదాపు 300 మంది గాయపడ్డారు. 1999లో 7.6 తీవ్రతతో భూమి కంపించింది. అప్పుడు సుమారు 2 వేల 4 వందలమంది ప్రాణాలు కోల్పోయారు. తైవాన్ చరిత్రలోనే అతిభీకర భూకంపంగా దీన్ని పరిగణిస్తారు. 2020లోనూ యిలాన్‌లోనే 6.2 తీవ్రతతో భూమి కంపించింది. 


Also read: UN Formation Day: ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవం, విశేషాలివే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook