UN Formation Day: యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ అంటే ఐక్యరాజ్యసమితి. ప్రతియేటా అక్టోబర్ 24న ఘనంగా దినోత్సవ జరుగుతుంది. 76 ఏళ్లుగా ప్రపంచదేశాల్ని ఏకతాటిపై తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న యూఎన్ విశేషాలేంటో తెలుసుకుందాం.
ఐక్యరాజ్యసమితి(United Nations Council)1945 అక్టోబర్ 24వ తేదీన ఏర్పడింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ యునైటెడ్ నేషన్స్ పేరును తొలిసారిగా ఉపయోగించారు. ఐక్యరాజ్యసమితిలో ఆరు కీలకమైన విభాగాలున్నాయి. జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రష్టీషిప్ కౌన్సిల్, సెక్రటేరియట్ వంటివి న్యూయార్క్‌లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలో ఉండగా..అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో ఉంది. ఐక్యరాజ్యసమితి ఏర్పడినప్పుడు 51 దేశాలుండగా ఇప్పుడు 193 సభ్యదేశాలున్నాయి.
ఐక్యరాజ్యసమితి అనేది అంతర్జాతీయ శాంతి భద్రతల్ని దృష్టిలో ఉంచుకుని స్నేహపూర్వక సంబంధాల్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఓ అంతర్ ప్రభుత్వ సంస్థ. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా దేశాలన్నింటినీ ఏకతాటిపై తీసుకొచ్చేలా సమన్వయం చేసే కేంద్రంగా ఈ సంస్థ కీలకపాత్ర పోషిస్తుంటుంది. ఐక్యరాజ్యసమితి ప్రాముఖ్యత, ఏ విధంగా ఏర్పాటైందనే విషయాలపై అవగాహన కోసం అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవం నిర్వహించుకుంటారు. న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయంలో ఐక్యతకు గుర్తుగా అన్ని దేశాలు కలిపి ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని జరుపుకుంటాయి. 76 ఏళ్ల క్రితం విపత్కర సంఘర్షణల్నించి బయటపడే ప్రపంచానికి ఆశావాహ దృక్పధంగా యూన్ ఆవిష్కరించబడిందని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. అటు దుబాయ్‌లో జరుగుతున్న ఎక్స్‌పో 2020లో(Dubai Expo 2020)కూడా వివిధ రకాల అధికారిక కార్యక్రమాలతో ఐక్యరాజ్యసమితి దినోత్సవం(UN Day)ఘనంగా జరుగుతోంది.
Also read: T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-పాకిస్తాన్, ఇప్పటివరకూ ఎవరిది పైచేయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook