Talibans Ruling: ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ఘట్టం పూర్తయింది. యూఎస్ దళాలు వైదొలగగానే విజయం సాధించామని ప్రకటించుకున్న తాలిబన్లకు రానున్న రోజుల్లో అసలు సమస్య ఎదురుకానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆఫ్ఘనిస్తాన్‌ను(Afghanistan) తాలిబన్లు వశపర్చుకున్న అనంతరం ఆ దేశం నుంచి అమెరికా బలగాల్ని పూర్తిగా ఉపసంహరించుకునే ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఆగస్టు 31 డెడ్‌లైన్‌లోగా అమెరికా తన బలగాల్ని వెనక్కి రప్పించుకుంది. అమెరికన్ బలగాల ఉపసంహరణ పూర్తవడంతో తాలిబన్లు విజయం సాధించామని ప్రకటించారు. నాడు రష్యాను, నేడు అమెరికాను ఓడించామని సంబరాలు చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ అంతిమంగా స్వేచ్ఛను సాధించిందని తాలిబన్ నేత హిక్మతుల్లా వాసిక్ తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేబినెట్ ప్రకటిస్తామన్నారు. ప్రజలంతా తమ తమ పనులకు తిరిగి వెళ్లాలని, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుతాయని తాలిబన్లు(Talibans)విజ్ఞప్తి చేశారు.


ఇంతవరకూ బాగానే ఉంది. కానీ మున్ముందు తాలిబన్లకు అసలు సమస్య ఎదురు కానుంది. విమానాశ్రయాన్ని(Kabul Airport) తిరిగి ప్రారంభించడం అతిపెద్ద సవాలుగా మారనుంది. విమానాశ్రయం పరిసరాల్లో ఎప్పటిలానే ఆందోళన, హడావిడి కన్పిస్తోంది. ఆశావహులు విమానాశ్రయం వైపుకు రాకుండా తాలిబన్లు కంచె వేసేశారు. అమెరికా దళాల ఉపసంహరణ సమయంలో కూడా మరోసారి దాడులు జరగకుండా జాగ్రత్త వహించారు. యూస్ దళాలు వెనక్కి వెళ్లగానే తాలిబన్ బలగాలు భారీగా విమానాశ్రయంలో వచ్చాయి. ఇక నుంచి దేశ రక్షణలో అప్రమత్తంగా ఉండాలని తాలిబన్ నేత తెలిపారు. ఎయిర్ పోర్ట్‌ను మళ్లీ ప్రారంభించేందుకు తమ సాంకేతిక బృందం పనిచేస్తోందన్నారు. ఇక నుంచి దేశం స్వేచ్ఛగా ఉంటుందని..షరియా చట్టం అమలు చేస్తామని చెప్పారు.


అయితే ఆఫ్ఘన్లు స్వేచ్ఛను ప్రకటించుకున్నా అసలు సమస్య మొదలు కానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకూ అందుతున్న అంతర్జాతీయ సహాయం నిలిచిపోవడం, కీలకమైన నిధుల్ని అమెరికా(America)తొక్కిపెట్టడంతో తాలిబన్ల పాలన కష్టతరం కానుంది. బ్యాంకుల్లో నిధులన్నీ కస్టమర్లు విత్ డ్రా చేసుకున్నారు. ప్రభుత్వోద్యోగులకు జీతాలు అందడం లేదు. దేశం కరువు తాండవిస్తోంది. ఈ తరుణంలో తాలిబన్లు దేశాన్ని ఎలా పాలిస్తారనేది సందేహంగా ఉంది. 


Also read: India-Afghanistan: తాలిబన్లతో ఇండియా రాయబారి దీపక్ మిట్టల్ చర్చలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook