Afghanistan War: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి రక్తసిక్తమవుతోంది. తాలిబన్లు పంజా విసురుతున్నారు. క్రమక్రమంగా దేశాన్ని ఆధీనంలో తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఆప్ఘన్‌లోని ఈశాన్య ప్రాంతమంతా తాలిబన్ల ఆధీనంలో వచ్చినట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆప్ఘనిస్తాన్ (Afghanistan)ప్రతిరోజూ దాడులు, ప్రతిదాడులు, బాంబులతో దద్దరిల్లిపోతోంది. విదేశీ సైన్యం నిష్క్రమణతో దేశం అట్టడుకుతోంది. తాలిబన్లకు, ఆప్ఘన్ సైన్యానికి నిరంతరం యుద్ధం జరుగుతోంది. మరోసారి దేశాన్ని తమ ఆధీనంలో తెచ్చుకునేందుకు తాలిబన్లు దాడులు తీవ్రతరం చేస్తున్నారు. ఆప్ఘనిస్తాన్ భూభాగాల్ని తాలిబన్ సైన్యం మెరుపువేగంతో స్వాధీనపర్చుకుంటోంది. ప్రావిన్స్‌లపై పట్టుకోసం ఆఫ్ఘన్ సైన్యం, తాలిబన్ మద్య పోరుతో దేశంలో యుద్ద పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా మూడు ప్రావిన్స్‌లు బదఖ్‌షాన్ రాజధాని ఫైజాబాద్, బాగ్‌లాన్ రాజధాని పోలి-ఖుమ్రి, ఫరాహ్ రాజధానులు తాలిబన్ల వశమవడంతో ఈశాన్యప్రాంతమంతా (Northeast Aghan in Taliban Control)తాలిబన్ల ఆధీనంలో వచ్చినట్టైంది.


కుందుజ్ ఎయిర్ పోర్ట్ సైనిక స్థావరాన్ని తాలిబన్లు(Talibans) ఆక్రమించడంతో ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ రంగంలో దిగారు. ప్రావిన్స్‌లోని వివిధ సైన్యాల నేతల్ని సాయం కోరుతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఆరు ప్రావిన్స్‌ల రాజధానులు తాలిబన్ల వశమయ్యాయి. ముఖ్యంగా ఆదాయ మార్గాల్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆఫ్ఘన్ సైన్యానికి మద్దతుగా అమెరికా సైన్యం అక్కడే ఉండనుందనే వార్తల్ని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden) ఖండించారు. ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాలు వెనక్కి రావడం ఖాయమని..ఆఫ్ఘన్ సైన్యం(Afghan Military) తమ దేశం కోసం తామే పోరాడుకోవాలని బైడెన్ స్పష్టం చేశారు. 20 ఏళ్లలో ఆఫ్ఘన్‌లో 74 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. 


Also read: ఆ దేశంలో ఉన్న ఇండియన్స్ వెంటనే తిరిగి రాకపోతే ప్రమాదమే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook