Talibans: అనుకున్నదే జరిగింది. ఆఫ్ఘన్‌లోని భారతీయుల్ని ఇండియాకు తరలించే క్రమంలో తాలిబన్లు దుశ్చర్యకు దిగారు. పెద్దఎత్తున భారతీయుల్ని కిడ్నాప్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యం(Talibans government) ఏర్పడటంతో వివిధ దేశాలకు చెందిన ప్రజలు స్వదేశాలకు వెళ్లిపోవడం ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడున్న భారతీయుల్ని తరలించేందుకు వైమానిక దళానికి (Indian Airforce)చెందిన సీ130 జే ప్రత్యేక విమానం 85 మంది ప్రయాణీకుల్ని తరలించారు. సీ17 విమానంలో 180 మందిని తరలించేందుకు ప్రయత్నించే క్రమంలో తాలిబన్లు దుశ్చర్యకు దిగారు. 


ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ విమానాశ్రయానికి (Kabul Airport)చేరుకునే క్రమంలో ఎయిర్‌పోర్ట్ సమీపంలో 150 మంది భారతీయుల్ని కిడ్నాప్ (Talibans kidnapped indians)చేశారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఈ విషయాన్ని కాబూల్‌లోని భారత ఎంబసీకు చెందిన ఆఫ్ఘన్ ఉద్యోగి వెల్లడించారు. తాలిబన్లు కిడ్నాప్ చేసినవారిలో ఇతర దేశాలకు చెందినవారు కూడా ఉన్నట్టు సమాచారం. భారతీయుల్ని తాలిబన్లు(Talibans) కిడ్నాప్ చేసిన విషయాన్ని ది న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ కూడా ట్వీట్ చేశారు. వీరందర్నీ విడుదల చేయించేందుకు కేంద్ర ప్రభుత్వం(Central government)బ్యాక్ ఛానెల్ ద్వారా చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులకు ప్రమాదం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


Also read: Afghanistan: ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook