Iyan Griggs: వామ్మో.. టాటూలకే రూ.29 లక్షలు ఖర్చు చేసిన ఘనుడు..!
Latest Trending Tattoo: టాటూలు వేయించుకోవడం కొందరికి సరదా అయితే మరికొందరికి పిచ్చిగా ఉంటుంది. ఆ పిచ్చి ఓ వ్యక్తితో ఏకంగా రూ.29 లక్షలు ఖర్చు చేయించింది. శరీరంలో ఖాళీలేకుండా మొత్తం టాటూలతో నింపేశాడు ఈ టాటూ లవర్.
Latest Trending Tattoo: టాటూలంటే చాలా మందికి పిచ్చి. దేవుడు బొమ్మలు, డిఫరెంట్ డిజైన్స్‌లో ఉన్న బొమ్మలు ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు టాటూలు వేయించుకోవడం చూసుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కేవలం టాటూలు వేయించుకునేందుకు పుట్టినట్లు ఉన్నాడు. తన శరీరంపై టాటూలు వేయించుకోవడానికి 30 వేల పౌండ్లు (29 లక్షల 50 వేల రూపాయలు) వెచ్చించాడు. ఇయాన్ గ్రిగ్స్ అనే వ్యక్తి తనను తాను మార్చుకోవడానికి దాదాపు 300 గంటలపాటు సూదితో టాటూలు వేయించుకున్నాడు. ప్రస్తుతం అతని శరీరమంతా పచ్చబొట్లతో నిండిపోయింది.
ఇయాన్ తన డిఫరెంట్ స్టైల్‌తో నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బాండెడ్ బై బ్లడ్, లెగసీతో పాటు ఇతర చిత్రాలలో యాక్ట్ చేశాడు. మాదక ద్రవ్యాలు, సరఫరా, హింసాత్మక ఘటనలో దాదాపు 12 సంవత్సరాల శిక్ష అనుభవించి.. జైలు నుంచి విడుదలయ్యాడు ఇయాన్. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత తనను తాను పూర్తి మార్చుకునేందుకు తన శరీరంపై పచ్చబొట్టు వేయించుకున్నాడు.
ఇయాన్ 18 సంవత్సరాల వయస్సులో తన మొదటి పచ్చబొట్టు వేసుకున్నాడు. అయితే ఏడు సంవత్సరాల క్రితం 2015లో జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి టాటూలపై ప్రేమ ఏర్పడింది. గత నాలుగేళ్లుగా ప్రతి వారం రెండు గంటలపాటు టాటూలు వేయించుకుంటున్నాడు. శరీరంపై ఖాళీ స్థలం లేకపోవడంతో టాటూ వేయించుకోవడం ఆపేశాడు.
ఇయాన్ ప్రేయసి లియానే 2008లో కారు ప్రమాదంలో మరణించింది. ఆ సమయంలో అతను జైలులో ఉన్నాడు. ప్రియురాలి మరణంతో ఇయాన్ బాగా కుంగిపోయాడు.'నేను ఎదుగుతున్నప్పుడు చాలా కష్టతరమైన జీవితాన్ని గడిపాను. నేను నా టీనేజ్, 20లలో జైలుకు వెళ్లి వచ్చాను. నేను జైలులో ఉన్నప్పుడు నా కొడుకు పుట్టాడు. అతను చాలా సంవత్సరాలు నన్నుచూసేందుకు వచ్చాడు. నాకు కొడుకు ఎదగడానికి నా అవసరం ఉంది చాలా అవసరం చాలా ఉంది. నేను లీన్‌తో మూడు సంవత్సరాలు జీవించాను. 2008లో కారు ప్రమాదంలో చనిపోయినప్పుడు ఆ బాధను నేను తట్టుకోలేకపోయాను' అని ఇయాన్ చెప్పుకొచ్చాడు. తాను కచ్చితంగా మళ్లీ నేర జీవితానికి తిరిగి వెళ్లనని స్పష్టం చేశాడు.
Also Read: 32 Inches Smart TV: స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్.. రూ.7 వేలకు లోపే 32 ఇంచుల టీవీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook