Pak Terror Attack: దాయాది దేశం పాకిస్తాన్‌లో ఘోర మారణకాండ చోటుచేసుకుంది. ఆ దేశ ఆర్మీ లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. తెహ్రీక్ ఎ జిహాద్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయడం గమనార్హం. దాడిలో ఇప్పటి వరకూ 23 మంది మరణించగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటన పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ఖైబర్ పఖ్తూన్‌క్వా ప్రావిన్స్‌లో జరిగింది. డేరా ఇస్మాయిల్ జిల్లాలోని పాక్ ఆర్మీ స్థావరంపై ఆత్మాహుతి దళాలు దాడి చేశారు. ఇవాళ తెల్లవారుజామున పేలుడు పదార్ధాలు నింపిన ట్రక్కుతో ఆరుగురు ఉగ్రవాదులు ఆర్మీ భవనాన్ని వేగంగా వచ్చి ఢీకొట్టారు. దాంతో భారీగా పేలుడు సంభవించింది. 23 మంది సైనికులు మరణించారని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. పేలుడు ధాటికి భవనం పూర్తిగా కూలిపోయింది. శిధిలాల కింద మరింత మంది ఉండవచ్చని తెలుస్తోంది. పాకిస్తాన్ తాలిబన్‌తో అనుబంధంగా ఉండే తెహ్రీక్ ఎ జిహాద్ పాకిస్తాన్ గ్రూపు ఈ దాడికి కారణంగా ప్రకటన చేసినట్టు సమాచారం అందుతోంది. 


రెండేళ్ల క్రితం అంటే 2021లో కూడా పాక్-ఆఫ్ఘన్ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు పెరిగాయి. ముఖ్యంగా ఖైబర్ పఖ్యూన్ , వజీరిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో ఆర్మీ, పోలీసు అధికారులు లక్ష్యంగా ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో గత ఏడాదితో పోలిస్తే దాడులు పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో పెషావర్ ప్రాంతంలో జరిగిన దాడిలో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మిలాద్ ఉన్ నబి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కూడా పేలుడు జరిగి 55 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Also read: Gaza Ceasefire: వీటోతో గాజాలో కాల్పుల విరమణకు మోకాలడ్డిన అమెరికా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook