The Rock Diamond Auction: ప్రపంచం చాలా రకాల విలువైన వస్తువులు ఉంటాయి. అందులో ముఖ్యమైన విలువైన వస్తువులలో వజ్రం ఒకటి. అయితే ఇటివల కాలంలో ది రాక్‌ అనే వజ్రం పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ప్రపంచంలో ఉన్న వజ్రాల కెళ్ల అతిపెద్ద తెలుపు రంగుతో కూడిన వజ్రం. అయితే ఇది వచ్చే వారం జెనీవాలో వేలానికి రానుంది. ఇప్పటివరకు వేలం వేసిన వజ్రాలతో పోలిస్తే ఇది అతి పెద్ద వజ్రమని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది.  క్రిస్టీస్ విక్రయించిన వాటిలో ఒక భాగమని 200 క్యారెట్ల కంటే ఎక్కువ బరువున్నఅతి పెద్ద విలువైన వజ్రమని తెలిపింది. ది రాక్‌పై‌ సుమారు $30 మిలియన్ల వరకు వేలం పాట పాడనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ది రాక్ అరుదైన వజ్రం:


ది రాక్ వజ్రం 228.31 క్యారెట్స్‌ను కలిగి ఉంటుంది.  ఇది పియర్ ఆకారంతో గోల్ఫ్ బాల్ పరిమాణంలో ఉంటుంది. ప్రపంచంలో ఇలాంటి ఆకారంలో ఏ వజ్రాలు లేవని రాయిటర్స్ పేర్కొంది. పియర్ ఆకారంలో ఉన్న ఓ అరుదైన రత్నామని తెలిపింది. దీనిని మొదట దక్షిణాఫ్రికాకి చెందిన కార్టియర్ నెక్లెస్‌ ధరించారు. ఈ వజ్రాన్ని ఆమె 2017లో విక్రయించారు.



వేలంకు రెడీ అయిన ఇతర వజ్రాలు:


ది రెడ్ క్రాస్ డైమండ్ పేరుతో పిలువబడే క్రిస్టీస్ 205.07 క్యారెట్ల గల పసుపు రంగుతో కూడిన మరో వజ్రం కూడా వేలంలోకి రానుంది.  వేలంలో వచ్చే ఆదాయాన్ని జెనీవాలోని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ICRC)కి అందించనున్నారు.


 


Also Read: KGF 2 Actor Died: KGF చాప్టర్ 2 ఫేమ్ నటుడు మోహన్ జునేజా ఇక లేరు..!


Also Read: Ap Govt Loan:జీతాలకు డబ్బులొస్తున్నాయ్.. ఏపీ సర్కార్ మరో 3 వేల కోట్ల రుణం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook