Abortion‌ law in America: అమెరికాలో అబార్షన్‌ హక్కులకు సంబంధించిన చట్టం రద్దయ్యే సంకేతాలు వస్తున్నాయి. అగ్రరాజ్యంలోని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో అబార్షన్‌కు సంబంధించి అమలులో ఉన్న హక్కులను కొట్టివేయబోతున్నట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా సుప్రీంకోర్టు అబార్షన్‌ హక్కులను కొట్టివేస్తూ తీర్పు ఇవ్వబోతున్నట్లు ఓ ముసాయిదా విడుదలయ్యింది. ఈ విషయం తెలియగానే దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బయటకు వచ్చిన ముసాయిదాలో జస్టిస్‌ సామ్యూల్‌ అలిటో కొన్ని కీలక అంశాలను చేర్చారు. 1973లో రో వర్సెస్‌ వేడ్‌ వేడ్‌ కేసులో వెలువడిన చారిత్రాత్మక తీర్పును జస్టిస్‌ సామ్యూల్‌ తప్పుగా పేర్కొన్నారు. రో వర్సెస్‌ వేడ్‌ చారిత్రక కేసులో ఇచ్చిన వివరణ చాలా బలహీనంగా ఉందని, ఫలితంగా పరిణామాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని జస్టిస్‌ అలిటో లీకైన ముసాయిదాలో అభిప్రాయం వ్యక్తం చేశారు. 


అబార్షన్‌ హక్కులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతినిధులకు ఇవ్వాలని ఆ ముసాయిదాలో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈయేడాది జూలైలో అబార్షన్‌ హక్కులపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే, తాజాగా లీక్‌ అయిన డాక్యుమెంట్‌లోని సమాచారంపై అమెరికా అత్యున్నత న్యాయస్థానం గానీ, వైట్‌ హౌస్‌ వర్గాలు గానీ స్పందించలేదు. 


మరోవైపు.. రిపబ్లికన్‌ పార్టీ నేతలతో నియమించబడ్డ న్యాయమూర్తులు ఇస్తున్న తీర్పు సరిగ్గా లేదంటూ తాజాగా లీక్‌ అయిన డాక్యుమెంట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాక్యుమెంట్‌లో ఉన్న అంశాలను విభేదిస్తున్న వాళ్లు సుప్రీంకోర్టు ముందు నిరసనలు చేపట్టారు. ఇటు.. సుప్రీంకోర్టుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్ లీక్‌ కావడం సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి పరిణామం ఎప్పుడూ చోటు చేసుకోలేదని అంటున్నారు.


Also Read: Russia Claims Lsrael Supports: రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య మాటల యుద్ధం..దుమారం లేపుతున్న ఆయన వ్యాఖ్యలు..!


Also Read: Sonu Nigam Comments: హిందీ జాతీయ భాష డైలాగ్‌ వార్‌ అంశంపై స్పందించిన గాయకుడు సోను నిగమ్‌..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook