Afghanistan: తాలిబన్ల చేతుల్లోకి కాందహార్ నగరం..ఆఫర్ ఇచ్చిన ఆప్ఘన్ ప్రభుత్వం !
Afghanistan: ఆప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మారణహోమాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా తాలిబన్లు కాందహార్ నగరాన్ని వశం చేసుకున్నారు.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల దురాక్రమణ కొనసాగుతుంది. కొద్దిరోజులుగా ఒక్కొక్క నగరాన్నీ అక్రమిస్తూ వస్తోన్న తాలిబన్లు..ఇప్పడు రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ ను కూడా వశం చేసుకున్నారు. ఈమేరకు తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు.
తాలిబన్ల(Talibans) ఆక్రమణలతో ఇక ప్రభుత్వ ఆధీనంలో కేవలం రాజధాని కాబూల్(Kabul), మరో ప్రావిన్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. 11 ప్రావిన్సుల రాజధానులను ఆక్రమించుకోగా దీంతో దేశంలో మూడింట రెండొంతుల భాగం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది.
ఆప్ఘానిస్తాన్(Afghanistan) నుంచి అమెరికా(America) బలగాల విరమణ ప్రారంభమైన తర్వాత తాలిబన్ల అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. సాధారణ ప్రజలను చంపుతూ.. భద్రతా దళాలపై దాడులకు తెగబడుతూ.. అధికార దాహంతో నెత్తుటేరులు పారిస్తున్నారు. రాజధాని కాబూల్‌ను వశం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలను ఆఫ్ఘాన్ ప్రభుత్వం కోల్పోయింది. ఉత్తర, పశ్చిమ ప్రాంతం మొత్తం తాలిబన్ల చేతుల్లోనే ఉంది. తాజాగా దేశంలోనే రెండో అతి పెద్ద నగరం కాందహార్(Kandahar)తో పాటు హెరాత్‌ను కూడా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: రక్తమోడుతున్న ఆప్ఘన్ నేల, తాలిబన్ల వశమవుతున్న దేశ భూభాగాలు
ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం చేతిలో ఉన్న ఏకైక పెద్ద నగరం ఆ దేశ రాజధాని కాబూల్(Kabul) మాత్రమే. కాబూల్‌ను స్వాధీనం చేసుకుంటే దాదాపు ఆప్ఘానిస్తాన్ మొత్తాన్ని తాలిబన్లు(Talibans) తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లే భావించవచ్చు. అనుకున్న దాని కంటే తక్కువ సమయంలోనే కాబూల్‌ను కూడా హస్తగతం చేసుకునే అవకాశముందని తాజా పరిస్థితులను చూస్తుంటే అర్ధమవుతోంది.
దేశంలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఆఫ్ఘానిస్తాన్(Afghanistan) ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. తాలిబన్లతో అధికారం పంచుకునే ఒప్పందానికి సిద్ధమని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఖతార్(Qatar)లోని ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులు తాలిబన్ల ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై తాలిబన్లు ఎలా స్పందిస్తారన్నది తెలియాల్సి ఉంది.
Also Read: ఆ దేశంలో ఉన్న ఇండియన్స్ వెంటనే తిరిగి రాకపోతే ప్రమాదమే
ఆఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడటంతో తమ పౌరులను అన్ని దేశాలను వెనక్కి రప్పిస్తున్నాయి. ఆఫ్ఘాన్‌లో ఉన్న భారతీయులంతా వీలైనంత త్వరగా తిరిగి వెనక్కి రప్పించేందుకు భారత్(india) విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. ఆప్ఘానిస్తాన్‌లో హింస నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రముఖ నగరాలకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. అమెరికా, బ్రిటన్(UK)లు తమ రాయబార కార్యాలయాలను ఖాళీ చేయిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook