Winter Olympics 2022: బీజింగ్‌లో అట్టహాసంగా శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభోత్సవం!
కరోనా సంక్షోభం మధ్యే శుక్రవారం `బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను ప్రారంభమయ్యాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 24వ శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభమైనట్లు అధికారిక ప్రకటన చేశారు.
Winter Olympics 2022: కరోనా సంక్షోభం మధ్యే శుక్రవారం 'బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను ప్రారంభమయ్యాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 24వ శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభమైనట్లు అధికారిక ప్రకటన చేశారు.
బీజింగ్‌లోని 'బర్డ్స్ నెస్ట్' స్టేడియంలో బాణసంచా వెలుగులతో లాంఛనంగా ఈ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. అయితే స్టేడియంలో ప్రేక్షకులు చాలా తక్కువగా కలిపించడం గమనార్హం. కొవిడ్ నేపథ్యంలో టికెట్లు విక్రయించకపోవడం వల్ల ప్రేక్షకులను అనుమతించలేదు. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన వారి, వివిధ దేశాల రిప్రజెంటేటివ్స్ మాత్రమే స్టేడియంలో కనిపించారు. ఈ స్టేడియం కెపాసిటి 90 వేల మంది కావడం విశేషం.
బీజింగ్ రికార్డు..
ఇక 2008లో సమ్మర్ ఒలింపిక్స్, ఇప్పుడు వింటర్ ఒలింపిక్స్ ప్రారంభించిన నగరంగా బీజింగ్ చరిత్ర సృష్టించింది.
కొవిడ్ 19 భయాలు, మానవహక్కుల సంఘం విమర్శల నేపథ్యంలోనే ఒలింపిక్స్ ప్రారంభమమవడం గమనార్హం.
అట్టహాసంగా ఆరంభ వేడుకలు..
ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మఖ్యంగా చైనీస్ క్యాలెండర్ ప్రకారం.. వసంతకాలం వచ్చిందనేందుకు సంకేతంగా డ్యాన్సర్లు ఆకుపట్ట జెండాలను ఊపుతూ.. ప్రదర్శన చేశారు.
ఆ తర్వాత వివిధ దేశాల కవాతు జరిగింది. ఒలింపిక్స్ సాంప్రదాయం ప్రకారం.. మొదటగా గ్రీస్ పరేడ్ స్టేడియంలోకి వెళ్లింది.
ఆ తర్వాతి కవాతులను చైనీస్ అక్షరాలతో.. మొదటగా వచ్చే దేశం ప్రకారం నిర్వహించారు. ఇందులో టర్కీ మొదటి రెండో స్థానంలో (గ్రీస్ తర్వాత) ఉంది.
ఇక శీతాకాల ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న చైనా కవాతు చివరగా వెళ్లింది.
వేడుకలకు పుతిన్ హాజరు..
ఒలింపిక్స్ క్రీడల ప్రారంబోత్సవానికి హాజరైన అంతర్జాతీయ నాయకుడిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ నిలిచారు. అయితే డోపింగ్ పరీక్షలో పట్టుబడ్డ కారణంగా.. రష్యా తరఫు అథ్లెట్లు.. తమ జాతీయ జెండాకుక బదులు.. రష్యన్ ఒలింపిక్స్ కమిటీ జెండాలతో కవాతు నిర్వహించారు. ఇక కవాతు నిర్వహించిన వారితో పాటు..స్టేడియంలో ఉన్నవారంతా మాస్కులు ధరించి, కొవిడ్ నిబంధనలను పాటించడం గమనార్హం.
Also read: Video: బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానానికి తప్పిన ప్రమాదం.. పైలట్ చాకచక్యం..
Also read: Covid Vaccine: ఐదేళ్ల లోపు చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్.. అత్యవసర అనుమతి కోరిన ఫైజర్-బయోఎన్‌టెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook