టిక్ టాక్ యాప్‌పై ( TikTok App ) భారత్ నిషేధం విధించడంతో ఆ యాప్‌ని అభివృద్ధి చేసి భారత్‌పైకి వదిలిన చైనా కంపెనీ బైట్ డ్యాన్స్ ( Bytedance ) విలవిలలాడుతోంది. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌ని భారత్ నిషేధించగా ( 59 chinese apps banned ).. అందులో బైట్ డ్యాన్స్‌కి చెందిన యాప్స్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అన్నింటికంటే ముఖ్యంగా అత్యంత ప్రజాధరణ పొంది బిలియన్ డాలర్ల లాభాలు ఆర్జిస్తున్న టిక్ టాక్ యాప్‌ని నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ఆ యాప్‌ని రూపొందించిన బైట్ డ్యాన్స్‌కి కోలుకోలేని షాక్ ఇచ్చినట్టయింది. ( Also read: Telangana: 24 గంటల్లో 1640 కరోనా కేసులు )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

China apps విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ అమెరికా ( TikTok in America), ఆస్ట్రేలియా లాంటి దేశాలు సైతం అదే బాటలో పయణించేందుకు సిద్ధమవుతున్నాయి. చైనా యాప్స్ పట్ల భారత్, అమెరికా వ్యవహరిస్తున్న తీరు మరిన్ని దేశాలను ఆ దిశగా నిర్ణయం తీసుకునేలా చేస్తోంది. అంతేకాకుండా ప్రపంచంలో అనేక దేశాలతో విభేదాలు కలిగి ఉన్న దేశమైన చైనాను ( China ) దెబ్బకొట్టాలంటే.. భారత్, అమెరికా బాటలోనే వెళ్లాలని ఇంకొన్ని దేశాలు భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అదే కానీ జరిగితే అనేక ప్రపంచదేశాల్లో టిక్ టాక్ యాప్‌తో పాటు పలు ఇతర మొబైల్ అప్లికేషన్స్‌పై ( Mobile applications ) పెట్టుబడులు పెట్టిన బైట్ డ్యాన్స్ కంపెనీ మరిన్ని భారీ నష్టాలను మూటగట్టుకోకతప్పదు. ( Viral video: కూరగాయలు అమ్ముకునే యువతి ఇంగ్లీష్‌లో అధికారులను కడిగిపారేసింది


చైనాకు చెక్ పెట్టే ప్రయత్నాల్లో భాగంగా పలు ప్రపంచ దేశాలు తమ తమ దేశాల రక్షణ కోసం టిక్ టాక్ యాప్‌ని నిషేధించే దిశగా సమాలోచనలు జరుపుతున్నాయని గ్రహించిన బైట్ డ్యాన్స్ కంపెనీ యజమాని ( Byte dance company owner ).. ముందుగానే ఆ సంస్థకు ఉన్న మెజారిటీ వాటాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. వాటాలను అమ్మి సొమ్ము చేసుకోవడం ద్వారా అయినా భారీ నష్టాల నుంచి బయటపడొచ్చని బైట్ డ్యాన్స్ భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా చైనీస్ కంపెనీ ( Chinese company ) అనే ముద్రను తొలగించుకునేందుకు సైతం బైట్ డ్యాన్స్ నానా తంటాలు పడుతోంది. అందుకోసం ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్‌ని సైతం చైనా నుంచి మరో దేశానికి తరలించేందుకు బైట్ డ్యాన్స్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. Instagram Reels: టిక్‌టాక్ స్థానంలో రీల్స్ యాప్.. ఇండియాలో ట్రయల్ షురూ!